Wednesday, November 30, 2022
Homespecial Editionదళిత సాహిత్యోద్యమ రథసారథి ఆచార్య ఎండ్లూరి సుధాకర్

దళిత సాహిత్యోద్యమ రథసారథి ఆచార్య ఎండ్లూరి సుధాకర్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

పత్రికా పాఠకులకు సుపరిచితులు డాక్టర్ ఎండ్లూరి సుధాకర్. జీవి తాంతం నిజాయితీ బాట లోనే నడిచారు. నిబద్ధతకు మారుపేరు గా నిలిచారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం సుధాకర్ కే సొంతం.

ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ జనవరి 21, 1959 న నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యు లు, తెలుగు సలహా మండలి సభ్యు లు, తెలుగు అకాడమీ సభ్యు లు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకులు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వ విద్యా లయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959 లో నిజామాబాద్ లోని పాముల బస్తిలో దేవయ్య, శాంతా బాయిలకు ప్రథమ సంతానంగా జన్మించారు. హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరా బాద్ లోనే సాగింది. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యా లయంలో ఎం .ఏ . ఎం.ఫిల్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం లో పిహెచ్ .డి చేసారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి విశ్వవిద్యా లయ ఆచార్య స్థాయికి చేరు కున్నారు. 1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్ లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు వివిధ పదవుల్ని నిర్వహిస్తు న్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచు రించే ‘వాజ్మయి’ సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా వ్యవహరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసి యేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు. 2009, సెప్టెంబరు 5వ తేదీ నుంచి రాజమండ్రి సాహి త్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యా లయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

జూలై 2002లో అమెరికా తెలుగు అసోసియేషన్‌లో జరిగిన పలు సాహిత్య సభల్లో ప్రసంగించారు. 2011, డిసెంబర్ 8,9,10 తేదీలలో మారిషస్ లో ప్రపంచ తెలుగు సదస్సులో పాల్గొన్నారు. మే 2017లో అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో సిలికాన్ ఆంధ్రా ద్వారా మనబడి కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నారు.

తెలుగు దళిత కవిత్వంలో తనదైన ముద్ర వేసుకున్న ఎండ్లూరి…వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తెలి వెన్నెల, తదితర రచనలు గావించి, తెలుగు సాహితీ క్షేత్రంలో తమదైన స్థానాన్ని పదిల పరచు కొన్నారు. నేటికి ఆయనను అనుకరిస్తూ, అనుసరిస్తూ ఆయన బాటలో పయనిస్తున్న వారు ఎందరో కవులు ఉన్నారంటే ఆయన ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాటి కవుల పట్ల సహృదయతే తప్ప అసూయ ఎరగని వ్యక్తిత్వం, ఎంత ఎత్తు ఎదిగినా అతి సామాన్య జీవితం గడపడం లాంటి ప్రత్యేకతలు ఆయనకే చెందుతాయని ఆయన తో పరిచయమున్న వారు చెపుతా రు. గుర్రం జాషువా అనంతరం అంతటి విశాల హృదయం, భావుకత లాంటి బహుముఖీన ప్రజ్ఞ సుధాకర్ లోనే కనబడుతుంది అంటే అతిశయోక్తి కాదు.

దళిత సాహితీ రథసారథి ఎండ్లూరి సహ దర్మచారిణి దివంగత హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు కాగా, వారి కూతురు ఎండ్లూరి మానస కథా రచయిత్రి, ఆమె రాసిన కథా సంపుటి “మిళిoద” కు 2020 సం.పు కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించడం విశేషం.

లలిత కళా పరిషత్ పురస్కారం, నల్గొండ, స్లిష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి , యల మంచిలి, ఫ్రీవర్స్ ఫ్రంట్, ఉదయ భారతి జాతీయ అవార్డు, భువనే శ్వర్, కవికోకిల జాషువా, తిలక్ అవార్డు, బెంగళూరు, గరిక పాటి సాహిత్య పురస్కారం కాకినాడ, సమతా రచయితల పురస్కారం అమలాపురం, రాజ మండ్రి ప్రతిభాపురస్కార్, రాజ మండ్రి, జాసిస్ అవార్డు, రాజ మండ్రి, మ్యాన్ ఆఫ్ ది ఇయర్, రాజమండ్రి, తెలుగు విశ్వ విద్యాలయం ధర్మనిధి పురస్కారం, బి.ఎస్. రాములు కథా పురస్కారం, ఎన్.జి. రంగాసెంటరీ అవార్డు, డెట్రాయిట్ తెలుగు అసో సియేషన్ సిల్వర్ జూబ్లీ అవార్డు, అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా, డల్లాస్ , సినారె పురస్కారం – కరీంనగర్ , నేదురుమల్లి జనార్ధన రెడ్డి ట్రస్ట్ ప్రకాశం, నెల్లూరు, సహృ దయ సాహితీ పురస్కారం, వరంగ ల్, కొండెపూడి శ్రీనివాసరావు కవితా పురస్కారం, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ అధికారభాషా సంఘ పుర స్కారం, ఆంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం, గాడే పల్లి కుక్కుటేశ్వరరావు స్మారక పురస్కా రం, అద్దంకి, తపన ఫౌండేషన్ అవార్డు రాజమండ్రి, ప్రతిభా వంతులైన విశ్వవిద్యాలయ ఉపా ధ్యాయులకు రాష్ట్ర అవార్డు, కవి జాషువా సాహిత్య ఆం.ప్ర. ప్రభుత్వ అవార్డు, రాజహంస కృష్ణ శాస్త్రి కవితా పురస్కారం, పిఠా పురం, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రతిభా పుర స్కారం, యువకళా వాహిని ద్వారా డాక్టర్ జి ఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు, అరుణ్ సాగర్ ట్రస్ట్ ద్వారా కవి అరుణ్ సాగర్ మెమోరియల్ అవార్డు, లెక్క లేనన్ని అందు కున్నారు. 28 జనవరి 2022 (శుక్రవారం) తెల్లవారు జామున హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. 63వ పుట్టిన రోజు తర్వాత వారం రోజుల కే ఈ లోకాన్ని వదిలి వెళతారని ఎవరూ హిస్తారు. సుధాకర్ ఆకస్మిక అకాల మరణం ఆధునిక తెలుగు సాహిత్యానికి తీరని లోటు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments