కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి,కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య.ఈ చిత్రాన్ని రామ్ చరణ్,నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ కు జోడిగా ఈ మూవీలో పూజ హెగ్డే కనిపించనున్నది.
ఈ మూవీలో పూజ హెగ్డే గిరిజన అమ్మాయి నీలాంబరిగా నటిస్తుంది.అందుకోసం ఆమె లుక్ ను మార్చుకుందని సమాచారం.మే 13న రిలీజ్ అవ్వనున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడబోతుందని సమాచారం.