5.1 C
New York
Sunday, May 28, 2023
Homespecial Editionసుదీర్ఘ రాజకీయ అనుభవశాలి కృపలానీ

సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి కృపలానీ

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి



ఆచార్య జె. బి. కృపలానీ (1888-1982) సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు, గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త , స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, పండితుడు, ఉపాధ్యాయుడు, రచయిత, మహాత్మా గాంధీ తొలి సహచరులు. గాంధీకి అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరు గాంచారు. 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా ఉన్నారు. 1951, 1957, 1963, 1967 లో లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కృపలానీ ఆపద్ధర్మ భారత ప్రభుత్వము (1946-1947) లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశారు.

ఆచార్య కృపాలనీ నాటి సింధు (నేటి పాకిస్తాన్) ప్రాంతంలోని హైదరాబాదులో 1888లో జన్మించారు. అతని పూర్వీకులు గుజరాతీ , సింధీ సంతతులకు చెందినవారు. కరాచి డి.జె.సైన్సు కళాశాలలో, ఆయన రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కళాశాల నుంచి బహిష్కరించారు.

కృపలానీ పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి చరిత్ర, ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి 1912 లో బోధన ప్రారంభించారు.
గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

ఉపాధ్యాయులుగా ఉన్న సమయం లోనే ఆయనకు మొదటి సారి గాంధీని కలిశారు. గాంధీని కలిసిన తరువాత కృపాలని కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్లలో గాంధీ ఆశ్రమాలలో పని చేశారు.

కృపలానీ 1920వ దశకపు తొలి నాళ్ళలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. గుజరాత్, మహా రాష్ట్ర లోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ , విద్యా సంబంధ విషయాలపై కృషి చేశారు. ఆ తరువాత ఉత్తర భారత దేశంలోని బీహార్ , సంయుక్త రాష్ట్రాలలో అదే తరహా ఆశ్రమాలు స్థాపించి బోధించడానికి వెళ్ళారు. పౌర నిరసనోద్యమం లోనూ , ఇతర అనేక చిన్న సందర్భాలలోనూ బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించిన, ఉద్రేకపూరిత సాహిత్యాన్ని ప్రచురించిన అనేక సందర్భాలలో కృపలానీ జైలుకు వెళ్ళారు.

1922 నుండి 1927 వరకు గాంధీ స్థాపించిన అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆచార్య అనే బిరుదును పొందారు.

కృపలానీ అఖిల భారత కాంగ్రేసు కమిటీలో చేరి 1928-29లో దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఒక దశాబ్దము పైగా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి కార్య కలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమ నిర్వహణలో ప్రధానపాత్ర పోషించారు.

1934-1935 మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. తరువాత 1946 లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

సైద్ధాంతికంగా వల్లభ్ భాయి పటేల్‌తోనూ, జవహర్ లాల్ నెహ్రూ తోనూ విరుద్ధముగా ఉన్నప్పటికీ, కృపలానీ 1947లో భారత స్వాతంత్ర్యానికి అటునిటు క్లిష్టమైన సంవత్సరాలలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1948 జనవరిలో గాంధీ హత్య తర్వాత, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో పార్టీ యొక్క అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలన్న కృపలానీ కోరికను నెహ్రూ తోసిరాజన్నారు. నెహ్రూ, పటేల్ మద్దతును కూడగట్టుకొని, “పార్టీకి విస్తృతమైన మార్గ దర్శకాలు, మూల సూత్రాలను నిర్దేశించే అధికారము కలిగి ఉన్నా, ప్రభుత్వ దైనందిన వ్యవహారాలలో కలుగ జేసుకొనే అధికారాన్ని పార్టీకి ఇవ్వలేమని” కృపలానీకి సమాధాన మిచ్చారు. సదరు పూర్వ ప్రమాణమే ఆ తర్వాత దశాబ్దాలలో ప్రభుత్వము , పాలక పార్టీ యొక్క సంబంధానికి కేంద్ర హేతువు అయ్యింది.

గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్యానికి తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణతో
కాంగ్రెస్ పార్టీని విడిచి, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ యొక్క సంస్థాపకుల్లో ఒకరైనారు. ఆ పార్టీ ఆ తరువాత సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీగా అవతరించింది.

కృపలానీ తన రాజకీయ శేష జీవితమంతా ప్రతిపక్షము.లోనే గడిపారు. 1938 నుండి ఆయన భార్య సుచేతా కృపలానీ, కాంగ్రేసు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గములో అనేక మార్లు మంత్రి పదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందారు. ఆమె దేశము లోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తర ప్రదేశ్ లో ప్రమాణ స్వీకారం చేశారు.

కృపలానీ 1963 ఆగస్టులో భారత – చైనా యుద్ధం ముగియగానే నెహ్రూ ప్రభుత్వముపై లోక్ సభలో మొట్ట మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

సమాజిక , పర్యావరణ విషయాలపై పనిచేస్తూ కృపలానీ జీవితాంతము నెహ్రూ, ఇందిరల పాలనా, విధానాల విమర్శకునిగా మిగిలి పోయారు.

క్రియాశీలక ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతూనే, కృపలానీ క్రమేణ రాజకీయ నాయకుడిగా కంటే కమ్యూనిస్టుల ఆధ్యాత్మిక గురువుగా పరిణతి చెందారు. ముఖ్యంగా వినోబా భావేతో పాటు కృపలానీని అంతరించి పోతున్న గాంధేయవాదుల వర్గానికి నాయకులుగా భావిస్తారు. 1970 లలో వినోభా భావేతో పాటు ఈయన అనేక పరిరక్షణ , సంరక్షణా కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరా గాంధీ పాలనలను విమర్శించారు. ఆయా పాలనకు గ్రామీణ గణతంత్రాల, గాంధేయ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని భావించారు.

1972-73లో, కృపలానీ, జయ ప్రకాశ్ నారాయణ్‌లు ఇందిరా గాంధీ పాలన నియంతృత్వంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని భావించి, ప్రధాని ఇందిర పాలనపై నిరసన ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించు కుందన్న అభియోగము న్యాయ స్థానములో నిర్ధారణ కావడంతో, రాజకీయ ప్రతిపక్షాలు ఆమెకు వ్యతిరేకంగా మరింత ముందుకు సాగాయి.

జయప్రకాష్ నారాయణ్‌తో పాటు, 1972-73లో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అహింసాత్మక నిరసన, శాసనోల్లంఘనను కోరుతూ కృపాలాని భారతదేశంలో పర్యటించారు. 1975లో అత్యయిక పరిస్థితిని విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన రేపడానికి కారకులు అయినారనే నెపంతో, జూన్ 26, 1975 రాత్రి అరెస్టు చేయబడిన మొట్ట మొదటి ప్రతిపక్ష నాయకుల్లో 80 యేళ్ళు పైబడిన కృపలానీ ఒకరు. ఎమర్జెన్సీ అంతం కావడం, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొంది స్వాతంత్య్రానంతరం మొట్ట మొదటి సారిగా ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొల్పటం చూడటానికి కృపలానీ జీవించే ఉన్నారు.

లోహియా గాంధేయ తత్వ శాస్త్రాలపై కొన్ని పుస్తకాలు కూడా రాశారు; “అహింసా విప్లవం”, “గాంధేయ వే”, “ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్”, “ది ఫేట్ఫుల్ ఇయర్స్”, “ది పాలిటిక్స్ ఆఫ్ చక్ర”, “ది ఫాదర్ ఆఫ్ ది కాంగ్రెస్”, “గాంధేయ విమర్శ” ముఖ్యమైనవి. కృపలానీ 94 యేళ్ళ వయసులో 1982, మార్చి 19న మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments