Wednesday, November 30, 2022
HomeNewsBRS కు షాక్: బీఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై !

BRS కు షాక్: బీఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై !

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

BRS కు షాక్: బీఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై !

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఆదిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ షాక్ తగిలింది. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పార్టీకి గుడ్ బై చెప్పారు. సెప్టెంబర్ 9న బీజేపిలో చేరబోతున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

గురువారం పరకాలలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మీడియా సమావేశం ఈ నెల 9వ తేదీన బీజేపీలో చేరింది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నుంచి బిక్షపతి చురుకైన పాత్ర పోషించారు. గతంలో పరకాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా, పరకాల జెడ్పీటీసీగా పని చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో మాజీ మంత్రి కొండా సురేఖ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బిక్షపతి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

కొన్నేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బిక్షపతి ఇప్పుడు అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరేందుకు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న బిక్షపతి సన్నిహితుల్లో కొందరు కూడా మొలుగురి వెంట బీజేపీలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి కొద్ది రోజుల క్రితం బీజేపీ చేరికల కమిటీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసి బీజేపీలో చేరడంపై చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో బిక్షపతి టీఆర్ఎస్‌ను వీడటం చర్చనీయాంశమైంది. సమావేశంలో బిక్షపతి వెంట పరకాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రాజభద్రయ్యతో పాటు మరికొందరు ఉన్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments