కోనోకార్పస్ చెట్టు కొమ్మను మట్టిలో నాటితే చాలు ఈ మొక్క బతికేస్తుంది. దీంతో వివిధ రాష్ట్రాలుఇతర దేశాల నుంచి ఈ మొక్కలను దిగుమతి చేసుకుని వాటిని నాటారు. చాలా తక్కువ టైంలో కోనోకార్పస్ జాతి మొక్క.. దేశం మొత్తం విస్తరించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలను నాటారు. హరిత హారంలో భాగంగా కూడా ఈ మొక్కలను నాటారు. దాంతో కొన్ని చోట్ల అవి ఏపుగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ మొక్కలపై విదేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ చెట్టు పువ్వు నుంచి వెలువడే రేణువులే దానికి కారణం. ఆ రేణువుల వల్ల శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సూచిస్తున్నారు. పైగా ఈ చెట్టు వేర్లు వల్ల పైపులైన్లను ధ్వంసం చేస్తుందని, పునాదులను, గోడలను బలహీనపరుస్తుందనే వాదనలు ఉన్నాయి.
దీనితో కొన్ని దేశాలు ఈ మొక్కలను నాటడం ఆపేశాయి. ఈ మేరకు కొనొకార్పస్ మొక్కను నాటొద్దని హైదరాబాద్ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనాలు వీధుల్లో, పైపులైన్పైన, ఇటీవల పక్కన అస్సలు నాటొద్దని కేంద్ర కార్యాలయం సర్కిల్ ఆఫీసులకు అందుబాటులో ఉంది. ఇక్కడే కాదు పరిశోధకుల హెచ్చరికలతో పూణే నగరపాలక సంస్థ అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నాటే మొక్కల్లోకొనొకార్పస్ను చేర్చమని, పక్కన పెట్టాలని నిర్ణయించారు. అలాగే యూపీలోని కొన్ని స్థానిక సంస్థలూ ఇదే నిర్ణయానికొచ్చాయి. దుబాయ్లో అయితే ఈ చెట్లను వేళ్లతో సహా పెకిలించారు. ఈ జిహెచ్సి కూడా ఆ మొక్కలపై బ్యాన్ విధించింది.