ఇండియాను తొలిసారి విశ్వ విజేత చేసిన అప్పటి భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కుతుంది.ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రను యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోషించాడు.ఈ బయోపిక్ ’83’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను రణ్‌వీర్ సింగ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ,దీపిక పదుకొనే,పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్, సాకిబ్ సలీమ్, అమ్మి విర్క్, సాహిల్ ఖత్తర్, నిశాంత్ దహియా, ఆర్ బద్రీ,డింకర్ శర్మ సౌత్ హీరో జీవ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.