5.1 C
New York
Saturday, March 25, 2023
HomeNewsచెత్త సేకరణ కోసం 650 స్వచ్ఛ ఆటోలు

చెత్త సేకరణ కోసం 650 స్వచ్ఛ ఆటోలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు చేపడుతున్నది. ఇంటింటి చెత్త సేకరణ కోసం 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు 300 స్వచ్ఛ ఆటో టిప్పర్లను మంత్రి శ్రీ కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీతోనే కాదని.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో స్వచ్ఛతను, పారిశుధ్యాన్ని ఒక ప్రాధాన్యంగా తీసుకొని 2015లో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2,500 స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరో 650 కొత్త స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఇందులో ఇవాళ 300 ఆటోలను నగరంలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

Municipal Administration & Urban Development Minister Sri KTR today flagged off 300 Swachh Auto Tipper vehicles at HMDA Grounds in Hyderabad. GHMC will be launching 350 more swachh autos soon.

Minister Sri Talasani Srinivas Yadav , MLA Sri Danam Nagender, Mayor Smt Gadwal Vijayalaxmi, Deputy Mayor Smt Mothe Srilatha Shoban Reddy, GHMC Commissioner Lokesh Kumar, GHMC Khairatabad Zonal Commissioner Pravinya participated.

The vehicles have separate partitions for collecting wet and dry waste and also the provision for hazardous waste collection. All the autos are equipped with a Public Address System and has a capacity to cover 600 households.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments