ఈమధ్య పెద్ద సినిమాలే రెండో వారాంతానికి చతికిలపడుతున్నాయి. అలాంటిది చిన్న సినిమాగా వచ్చిన ‘బేబీ’ మాత్రం రెండో వారాంతంలోనూ మొదటి వారాంతం స్థాయిలో వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. మొదటి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ.3.77 కోట్ల షేర్ రాబట్టిన బేబీ, పదో రోజైన రెండో ఆదివారం కూడా రూ.3.40 కోట్ల షేర్ రాబట్టిందంటే ప్రేక్షకులు ఏస్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.