5.1 C
New York
Sunday, April 2, 2023
HomeEntertainmentMovie Updates30 రోజుల్లో ప్రేమించడం ఎలా"ఫ్రీ-రిలీజ్ వేడుకలో

30 రోజుల్లో ప్రేమించడం ఎలా”ఫ్రీ-రిలీజ్ వేడుకలో

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా” చిత్రం పెద్ద హిట్ అయి హీరోగా ప్రదీప్ కి గుడ్ బిగినింగ్ అవ్వాలి.. ఫ్రీ-రిలీజ్ వేడుకలో అతిధుల ఆకాంక్ష!!

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అభిరుచిగల నిర్మాత యస్వీ బాబు నిర్మించిన చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో మ్యూజికల్ హిట్ గా నిలిచి 300 మిలియన్స్ వ్యూస్ సాధించింది. జనవరి 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో యూవీ, జిఏ 2 సంస్థల ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది..  కాగా ఈ చిత్రం ఫ్రీ- రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో పండగ వాతావరణాన్ని తలపించేలా వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి సుమ తనదైన శైలిలో వ్యాఖ్యాతగా వ్యవహరించి అందర్నీ అలరించారు. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, మారుతీ, హీరోలు కార్తికేయ, అడవి శేష్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ అమృత అయ్యర్, ఫణి ప్రదీప్, అనూప్ రూబెన్స్, కెమెరామాన్ శివేంద్ర, సింగర్స్ సిద్ శ్రీరామ్, కమిడియెన్స్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, మహేష్, భద్రం, ఆది, నటుడు సమీర్, నటి హేమ, నిర్మాత యస్వీ బాబు, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనిల్ రావిపూడి, మారుతి, కార్తికేయ, అడవి శేష్ సంయుక్తంగా  ప్లాటినం డిస్క్ లను ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి అందించారు.

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ యస్వీ బాబు నాకు బాగా ఇష్టమైన వ్యక్ఝి. ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయన నాలాగే మంచి సినిమాలు చేయాలనుకొనే సినిమా లవర్. ప్రదీప్ తో తీసిన ఈ సినిమా బాగా ఆడి రాబోయే ముప్పై రోజుల్లో బాబు గారికి మరిన్ని డబ్బులు రావాలి.. అన్నారు.

దర్శకుడు మారుతి మాజలాడుతూ.. ‘ నీలి నీలి  పాట ఒక సంవత్సరం అంతా వినేలా చేసింది.. అంటే మాములు విషయం కాదు. అంతటి గొప్ప పాటని కంపోజ్ చేసిన అనూప్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ కావాలి. ప్రదీప్ బుల్లి తెరపై అందర్నీ ఎంటర్టైన్ చేసాడు.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మున్నా చాలా రోజులుగా తెలుసు. ఎప్పుడు కలిసిన డిఫరెంట్ కథలు చెపుతుంటాడు. అతని మాటలు, మెసేజ్ లు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. మున్నాకి ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. అన్నారు.

యువ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ ప్రదీప్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మంచి హిట్ అయి అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. నా పటాస్ సినిమాని యస్వీ బాబు గారు కన్నడలో రిలీజ్ చేశారు. అక్కడ కూడా బాగా ఆడింది. ఈ సినిమాలోని నీలి నీలి పాట వన్ ఇయర్ నుండి స్టిల్ రన్నింగ్ అవుతూ.. శ్రోతలను అలరిస్తుంది. పాడుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి లిరిక్స్. అనూప్ టీమ్ కి కంగ్రాట్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాత బాబు గారికి మరిన్ని డబ్బులు రావాలి.. అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ప్రదీప్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద పొజిషన్స్ కి వెళతారు అని నేను గట్టిగా నమ్ముతాను. అది ప్రదీప్ అన్నలో బాగా ఉంది. 90ml మూవీలో ‘సింగిల్ సింగిల్’ పాట బిగ్ హిట్ అయింది. దానికి పదింతలు నీలి నీలి సాంగ్ హిట్ అయింది. అనూప్ వన్డ్రఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని.. ప్రదీప్ మంచి హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

 చిత్ర హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్కరూ వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి.. ఆదరించి అభిమానించారు. వారందరి సపోర్టుతోనే ఇక్కడిదాకా రాగలిగాను. నేను ఈ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది. ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మున్నా కథ చెప్పినప్పుడు నేను చేయగలనా అనే భయం వేసింది. ప్రతిక్షణం మున్నా నా వెంట ఉండి.. నువ్ చేయగలవ్ అని.. ఎంకరేజ్ చేస్తూ నా మీద నమ్మకంతో ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చాడు.. ఒక బ్రదర్ లా ట్రీట్ చేసి ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా నిర్మాత బాబు గారు.. కథపై నమ్మకంతో చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమా రేంజ్ లో ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. నా మొదటి సినిమాకే అంత మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత దొరకడం నా అదృష్టం. అనూప్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ ఇచ్చాడు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ‘నీలి నీలి’ పాటనిచ్చారు. అలాగే శివేంద్ర అంతే అందంగా ప్రతీ ఫ్రెమ్ ని అందంగా చిత్రీకరించారు. చక్కని లిరిక్స్ రాసిన చంద్రబోస్, అనంత్ శ్రీరామ్ లకు నా థాంక్స్. అమృత అయ్యర్ బ్యూటిఫుల్ యక్ట్రెస్.. చాలా కోపరేట్ చేసి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే ఒక మంచి చిత్రం చేశాం.. ఈ సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్ చెయ్యాలని కోనుకుంటున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) మాట్లాడుతూ.. ‘ నీలి నీలి పాట 300 మిలియన్స్ దాటి ఇంకా ట్రెండింగ్ లో ఉంది. అంతలా హిట్ అయింది. చాలా రోజుల తర్వాత ఆడియో ప్లాటినం డిస్క్ అందుకోవడం చూస్తుంటే బుజ్ బమ్స్ వస్తున్నాయి. ఈ క్రెడిట్ అంతా అనూప్ దే..ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పాండమిక్ వల్ల డిలే అయిందని బాధపడుతున్న టైంలో మా నీలి నీలి పాట ఒక ఎనర్జీని ఇచ్చి.. మా బాదంతా పోయేలా చేసింది. అందరం కష్టపడి ఒక మంచి సినిమా చేశాం. ఎన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆఫర్స్ వచ్చినా రిలీజ్ చేయకుండా మా కష్టాన్ని గుర్తించి   బాబు గారు ఇప్పుడు థియేటర్స్ లో సినిమాని విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ప్రదీప్, అమృత చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. వారి క్యారెక్టర్స్ ప్రేక్షకులను వెంటాడతాయి.. అంతగా కనెక్ట్ అవుతారు. వాళ్ళిద్దరూ నా కలని నిజం చేశారు. బాబు గారి లాంటి ప్రొడ్యూసర్ నాకు లైఫ్ లో దొరకడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంత బాగా చూసుకొని.. నేను అనుకున్న దానికన్నా ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు.. ఆయనకి జీవితాంతం ఋణపడి ఉంటాను.. అన్నారు.

చిత్ర నిర్మాత యస్వీ బాబు మాట్లాడుతూ.. ‘ లాస్ట్ ఇయర్ మార్చ్ 25న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశాం. ఇంతలో కరోన లాక్డౌన్ విధించారు. అయినా కూడా నిరుత్సాహ పడకుండా వెయిట్ చేసి ఇప్పుడు జనవరి 29న మా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జిఏ 2, యూవీ సంస్థలు ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ప్రదీప్, అమృత ఇద్దరూ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు.. అమృతని నటనా అభినేత్రి అని పిలుస్తుంటాను. నీలి నీలి పాట అందర్నీ అలరిస్తుంది.. ఈ క్రెడిట్ అంతా అనూప్ కె దక్కుతుంది. లిరికి రాసిన చంద్రబోస్, పాడిన సిద్ శ్రీరామ్, సునీత గారికి ధన్యవాదాలు. సినిమా చూశాను.. బాగా వచ్చింది. ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది. మా సినిమా చూసి ఆదరించి సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘ నీలి నీలి పాట ఎంతలా హిట్ అయిందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థాంక్స్. అలాగే నీలి నీలి సాంగ్ పాడిన సిద్ శ్రీరామ్, సునీత గారికి స్పెషల్ థాంక్స్. ఈ చిత్రంలో నాకు బాగా ఇష్టమైనది అమ్మ పాట. దీనిని అమ్మలకు డెడికేట్ చేస్తున్నాం.. అన్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments