ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి( Venu Swamy ) ఈ మధ్యకాలంలో తరచు వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన సిని రాజకీయాలకు సంబంధించిన సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.
ఈయన గతంలో సమంత ( Samantha ) విడాకులు తీసుకుంటుందని చెప్పగా చాలా మంది విమర్శలు చేశారు.అయితే చివరికి ఈయన చెప్పిన మాటలే నిజమయ్యాయి.
ఇలా పలువురి విషయంలో వేణు స్వామి మాటలు నిజం కావడంతో ఈయన మాటలను విశ్వసించే వారి సంఖ్య కూడా అధికమవుతుంది.

సమంత నాగచైతన్య( Nagachaitanya ) ఎలాగైతే విడాకులు తీసుకొని విడిపోయారో ప్రస్తుతం అదే ఇండస్ట్రీలో మరోసారి రిపీట్ కాబోతుందని ఈ క్రమంలోనే ఈ ఏడాది మరో జంట విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమయ్యారు అంటూ వేణు స్వామి తెలిపారు.శని ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల సమంత నాగచైతన్య మధ్య విభేదాలు వచ్చాయి.ఈ విభేదాల కారణంగానే వీరిద్దరూ దూరంగా ఉంటూ విడాకులు తీసుకున్నారని అయితే ప్రస్తుతం ఇదే మరోసారి ఇండస్ట్రీలో రిపీట్ కాబోతుందని తెలిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) అభిషేక్ బచ్చన్ ( Abhisekh Bachchan ) దంపతుల మధ్య గొడవలు వచ్చాయని ఇప్పటికే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి.అయితే త్వరలోనే వీరిద్దరూ కూడా విడాకులు ( Divorce ) తీసుకోబోతున్నారంటూ వేణు స్వామి చెప్పినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అయితే ఇదివరకే ఐశ్వర్య అభిషేక్ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన తరుణంలో ఈ వార్తలను అభిషేక్ బచ్చన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.అయితే మరోసారి ఈయన విడాకుల గురించి వేణు స్వామి చెప్పారంటూ వైరల్ అవుతున్నటువంటి ఈ విషయంపై అభిషేక్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది
.
