‘ఆర్ఆర్ఆర్’కి ముందు జపాన్ లో ఇండియన్ సినిమాలలో 400 మిలియన్ యెన్స్ తో ‘ముత్తు’ టాప్ లో ఉండేది. అయితే ఇప్పుడేకంగా 2.17 బిలియన్ యెన్స్ కి పైగా వసూలు చేసి ‘ఆర్ఆర్ఆర్’ టాప్ లో ఉంది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ.125 కోట్లకు పైగా ఉంటుంది. జపాన్ లో ఈ స్థాయిలో సత్తా చాటుతుంది కాబట్టే ‘ఆర్ఆర్ఆర్’ రూ.1300 కోట్ల క్లబ్ లో చేరింది. ఇండియన్ సినిమాలలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా రూ.2000 కోట్లతో ‘దంగల్’, రూ.1800 కోట్లతో ‘బాహుబలి-2’ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. రూ.1,316 కోట్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ‘కేజీఎఫ్-2’ ఉంది.