హిరణ్య కశ్యప: గుణ ఇంతటితో ఊరుకుంటాడా?

Date:


దీని మీద కొన్నేళ్ల పాటు ఆయన పని చేశాడు. డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. తీరా చూస్తే ప్రాజెక్టుకు పునాది వేసిన వ్యక్తినే పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు ఈ సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. గుణశేఖర్ తనకేదైనా అన్యాయం జరిగితే ఊరుకునే టైపు కాదు. గతంలో ‘కత్తి’ సినిమా టైటిల్ విషయంలో, ‘రుద్రమదేవి’ సినిమాకు ఏపీలో పన్ను మినహాయింపు రానపుడు ఆయన ఊరుకోలేదు. అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించాడు. అలాంటిది ఇప్పుడు తనెంతో కష్టపడి ఒక డ్రీమ్ ప్రాజెక్టులా చేయాలనుకున్న సినిమా విషయంలో అన్యాయం జరిగితే వదిలేస్తాడా అన్నది ప్రశ్న.

రానా ‘హిరణ్య కశ్యప’ను అనౌన్స్ చేయగానే.. గుణశేఖర్ నర్మగర్భమైన ట్వీట్ ఒకటి వేశాడు. దేవుడి మీద సినిమా తీస్తూ తప్పు చేస్తే దేవుడు ఊరుకోడన్నట్లుగా ఆయన మాట్లాడాడు. పరోక్షంగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ల నైతికతను ప్రశ్నించాడు. ఐతే ఇలా జస్ట్ ఒక ట్వీట్ వేసి ఈ వివాదానికి గుణశేఖర్ తెరదించేస్తాడా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ‘హిరణ్య కశ్యప’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందే ఆయన.

రానా దగ్గుబాటిని హీరోగా అనుకుని సురేష్ బాబును నిర్మాణానికి ఒప్పించి ఈ ప్రాజెక్టును ఘనంగా అనౌన్స్ చేశాడు. కానీ ఏవో కారణాలతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపి ‘శాకుంతలం’ సినిమా తీశాడు గుణ. దీని తర్వాత కచ్చితంగా ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సొంతంగా ‘హిరణ్య కశ్యప’ తీయడానికి రెడీ అయిపోయారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్రివిక్రమ్ రైటర్ కాగా.. దర్శకుడెవరన్నది ఇంకా ప్రకటించలేదు.

హిరణ్య కశ్యప అనగానే అందరికీ చాలా ఏళ్ల నుంచి గుర్తుకు వస్తున్న పేరు గుణశేఖర్‌దే. తన కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకుంటున్న సమయంలో భారీ బడ్జెట్లో ‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసి, దాన్ని హిట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన గుణ.. ఆ తర్వాత అంతకుమించిన సాహసోపేతమైన ‘హిరణ్యకశ్యప’ సినిమా తీయాలనుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...