హిడింబ.. అదే ప్లస్ అదే మైనస్

Date:


దర్శకుడు అనీల్ కన్నెగంటి ఎంతో పరిశోధించి, కసరత్తు చేసే ఈ సినిమా తీశాడని అర్థమైంది. మనుషుల్ని తినే కానిబల్స్ గురించి ఇందులో చూపించిన విషయాలు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తాయి. కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఒళ్లు గగుర్పొడిచేలా ఆ సీన్లను డీల్ చేశాడు అనీల్. సినిమాలో ట్విస్ట్ కూడా బాగానే పేలింది. కాకపోతే ఈ సినిమాలో కొత్తగా అనిపించే కానిబల్ కాన్సెప్టే మైనస్ కూడా అయింది.

ఐతే ‘సామజవరగమన’కు వచ్చినట్లు ప్రిమియర్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాకేమీ రాలేదు. రిలీజ్ ముంగిట అంతా గప్‌చుప్ అన్నట్లు ఉండటంతోనే సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. ఇక శుక్రవారం రిలీజ్ రోజు థియేటర్లలో సినిమా చూసిన వాళ్లకు విచిత్రమైన అనుభూతి కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ తెలుగు సినిమాలో నెవర్ బిఫోర్ అనడంలో సందేహం లేదు.

దాని ట్రైలర్ అంత స్టన్నింగ్‌గా అనిపించింది. ‘హిడింబ’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం కూడా చాన్నాళ్ల పాటు జనాలకు తెలియదు కానీ.. ట్రైలర్ చూడగానే ఈ సినిమా చూడాల్సిందే అన్న ఫీలింగ్ కలిగింది సినీ ప్రియులకు. ఆ ట్రైలరే సినిమాకు మంచి బిజనెస్ కూడా జరిగేలా చేసింది. సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో నిర్మాత అనిల్ సుంకర ‘సామజవరగమన’ తరహాలోనే దీనికి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేశాడు.

టాలీవుడ్లో కొన్ని వారాలుగా చిన్న సినిమాల హవా నడుస్తోంది. గత నెలలో ‘సామజవరగమన’ అంచనాలను మించిపోయి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘బేబి’ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. రెండో వారంలోనూ ‘బేబి’ జోరు కొనసాగుతోంది. ఈ వారం రిలీజైన చిత్రాల్లో ‘హిడింబ’ ప్రామిసింగ్‌గా కనిపించింది. ఇది కూడా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...