హార్ట్ ఆఫ్ ‘సైంధవ్’ గా బేబీ సారా..

Date:

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్‌’. ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే హై-ఆక్టేన్ యాక్షన్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక పాత్రకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ ప్ర‌క‌టించారు.

బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని రివిల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం చూడవచ్చు. పోస్టర్ లో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖ్ టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కథానాయికగా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...