‘హత్య’ సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్. ఫేమస్ మోడల్ లైలా (మీనాక్షీ చౌదరి) తన ఫ్లాట్ లో హత్యకు గురవుతుంది. ఆ కేసును కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య(రితికా సింగ్)కి అప్పగిస్తారు. ఆమె ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) సహాయం కోరుతుంది. అసలు మోడల్ లైలాను హత్య చేసింది ఎవరు? సంధ్య, వినాయక్ కలిసి నేరస్థులను ఎలా పట్టుకోగలిగారు? అనేది మిగిలిన కథ.