స్క్రాప్ అన్నందుకు JD పేలిపోయే పంచు  

Date:


పవన్ సాధినేని దర్శకత్వం వహించిన దయాలో జెడి చక్రవర్తి ఒక చెవి పని చేయని వైడ్ డ్రైవర్ గా నటించారు. ట్రైలర్ మంచి ఆసక్తి రేపింది. ఇది తనకు బ్రేక్ అవుతుందని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరలోనూ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం ఉంది కానీ ఆయన మాత్రం దాని గురించి బయట పడటం లేదు. అయినా తన గురువు రామ్ గోపాల్ వర్మనే తప్పుంటే ఓపెన్ గా విమర్శించడానికి వెనుకాడని జెడి చక్రవర్తిని ఒక కుర్రాడు వచ్చి నీది స్క్రాప్ పీరియడ్ అంటే ఒళ్ళు మండకుండా ఉంటుంది. అందుకే ఈ రేంజ్ లో బూమరాంగ్ అయ్యింది.

అందులో సదరు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి సత్య తర్వాత మీకు స్క్రాప్ పీరియడ్ వచ్చింది కదాని నేరుగా అనేశారు. దీంతో జెడి ఏ మాత్రం తొణక్కుండా అవును అది రావడం వల్లే కదా నీ లాంటి వాళ్ళతో మాట్లాడే దుస్థితి పట్టిందని నేరుగా చెప్పేయడంతో ఒక్క నిమిషం అవతలి వ్యక్తికి మైండ్ బ్లాంక్ అయ్యింది. అంటే ఒకవేళ హిట్లు పడి మంచి ఫామ్ లో ఉంటే నీలాంటి చిన్నా చితక లాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే అవసరం లేదన్న అర్థంలో కౌంటర్ ఇవ్వడంతో అది కాస్తా ఫ్యాన్స్ కి చేరిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా వాతపెట్టారంటూ జెడికి కితాబు ఇస్తున్నారు.

శివ విలన్ గా మనకు పరిచయమున్న జెడి చక్రవర్తి అప్పుడప్పుడు తెరమీద కనిపిస్తారు తప్ప రెగ్యులర్ గా ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు దర్శకులు సిద్ధంగా ఉన్నా ఆయన మాత్రం అంత సులభంగా ఒప్పుకోవడం లేదు. ఇప్పటికీ మంచి ఎనర్జీతో యూత్ ఫుల్ గా కనిపించే జెడి వచ్చే నెల హాట్ స్టార్ లో రిలీజ్ కాబోయే దయా ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రమోషన్ ప్రోగ్రాంస్ లో పాల్గొంటున్నారు. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జెడి ఒక యుట్యూబర్ తో సంభాషించే క్రమంలో అన్న మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...