సోమవారం హౌస్ ఫుల్స్ ఏందయ్యా

Date:


వైజాగ్‌లో మధ్యాహ్నం మూడు షోలూ ఫుల్ అయ్యాయి. నైజాం ఏరియాలో కూడా ‘బేబి’ దూకుడు చూపిస్తోంది. సిటీలో పలు థియేటర్లలో మధ్యాహ్నం మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి. కొన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. సాయంత్రం, రాత్రి షోలకు మరింత మంచి ఆక్యుపెన్సీ ఉంటుందనడంలో సందేహం లేదు. వీక్ డేస్‌లో ఇంత బలంగా నిలబడిన చిన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండం. రోజు రోజుకూ రేంజి పెంచుకుంటూ వెళ్తున్న ‘బేబి’ ఫుల్ రన్లో ఏ స్థాయిలో నిలుస్తుందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది.

తిరుపతి, కడప, కర్నూలు లాంటి సిటీల్లో ‘బేబి’కి మ్యాట్నీలు ఫుల్ అయ్యాయి. కడపలో ఈ సినిమా ఆడుతున్న రాజా థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు మ్యాట్నీకి. తిరుపతిలో ఒకటికి మించి థియేటర్లు ఫుల్ అయ్యాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక ఆంధ్రా ప్రాంతంలో చూస్తే వైజాగ్ లాంటి పెద్ద సిటీలోనే కాక చిన్న నగరాల్లో కూడా ‘బేబి’కి సోమవారం ఫుల్స్ పడటం విశేషం.

చిన్న సినిమాల్లో కూడా పెద్ద విజయం సాధించినవి ఉన్నాయి కానీ.. ఈ సినిమా రేపుతున్న సంచలనం మాత్రం అలాంటిలాంటిది కాదు. సోమవారం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పడటం షాకింగే. మామూలుగా రాయలసీమలో మాస్ సినిమాలకు మాత్రమే సోమవారం వసూళ్లు నిలకడగా ఉంటాయి. కానీ ఈ చిన్న సినిమా ఆ మాస్ ఏరియాల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతుండటం ట్రేడ్ పండిట్లకు కూడా పెద్ద షాకే.

మంచి టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలు సైతం తొలి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్లో అయిపోతుంటాయి. వసూళ్లలో డ్రాప్ సహజం. సోమవారం 60-70 శాతం ఆక్యుపెన్సీలు వచ్చినా కూడా సినిమా చాలా బాగా ఆడుతున్నట్లే. చిన్న సినిమాలకు థియేటర్లు సగం నిండినా గొప్పగా చూస్తారు. కానీ ‘బేబి’ అనే చిన్న సినిమా.. వీకెండ్ తర్వాతి రోజు చూపిస్తున్న దూకుడు టాలీవుడ్‌కు పెద్ద షాకే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...