అప్పట్లో మంచి అందం గా ఉండి చూడగానే హీరో అని అనిపించేలా ఉండేవాడు సుధాకర్.( Sudhakar ) చాలా తక్కువ టైంలోనే హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఈయన స్టార్డం ని ఓర్వలేని కొంతమంది అంతకు ముందు ఉన్న స్టార్ హీరోలు ఎలాగైనా సుధాకర్ ని తొక్కేయాలని చూసి ఎట్టకేలకు ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా దర్శక నిర్మాతలకు చెప్పి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వాల్సిన సుధాకర్ ని తోక్కేసి చివరికి తెలుగులో చిన్నా చితక పాత్రలు చేసుకునేలా చేశారు…
కానీ తెలుగులోకి వచ్చాక కూడా తనదైన కామెడీతో స్టార్ కమెడియన్ గా( Star Comedian ) సుధాకర్ పేరు తెచ్చుకున్నారు.
అయితే అలాంటి సుధాకర్ ఈ మధ్యకాలంలో చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ స్వయంగా సుధాకర్ నేను బతికే ఉన్నాను.నన్ను చంపకండి అంటూ క్లారిటీ ఇచ్చారు.అయితే అలాంటి సుధాకర్ లవ్ మ్యాటర్ వినిపించగానే అందరికీ హీరోయిన్ రాధిక( Radhika ) గుర్తుకు వస్తుంది…

కానీ రాధిక కాకుండా మరో హీరోయిన్ ని కూడా సుధాకర్ ప్రేమించారట.ఆ హీరోయిన్ పేరే జయచిత్ర.( Jayachitra ) ఈమె అందానికి అప్పటి స్టార్ హీరోలైన చాలామంది వెంటపడేవారట.అందులో కొంతమంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారట.
కానీ ఎవరిని కూడా జయచిత్ర దగ్గరికి రానిచ్చేది కాదట.కానీ కేవలం సుధాకర్ కి మాత్రమే జయచిత్ర దగ్గరయింది.
ఇక సుధాకర్ మాటలకి పడిపోయిన జయచిత్ర పెళ్లి చేసుకుంటాను అనే వరకు వెళ్లిందట.

కానీ ఓ రోజు సుధాకర్ క్రిస్టియన్ అమ్మాయిని చెన్నైలోని దుర్గా టెంపుల్ లో పెళ్లి చేసుకోవడం చూసి జయ చిత్ర ఎంతగానో కుంగిపోయిందట.అప్పటినుండి అబ్బాయిల విషయంలో ఆమె చాలా సీరియస్ గా ఉండేదట.ఇక ప్రేమలో విఫలమైన జయ చిత్ర కొన్ని రోజులు డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందట.
కానీ ఆ బాధనుండి తేరుకొని ఎలాగైనా సుధాకర్ కంటే అందగాడిని పెళ్లి చేసుకోవాలనే పంతంతో గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది…
ఇక ప్రస్తుతం సుధాకర్ కొంచం హెల్త్ ప్రాబ్లం తో ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన సినిమాలు చేసే అంత ఆక్టివ్ గా లేకపోవడం తో వాళ్ల ఫ్యామిలీ ఆయన్ని చాలా బాగా చూసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఆయన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేయబోతన్నారని తెలుస్తుంది…
.
