వరసగా సినిమా విడుదల డేట్స్ ను అభిమానులతో పంచుకున్న చిత్ర యూనిట్ లు చెప్పిన డేట్ కు తమ చిత్రాలను తీసుకురావాలని ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి.ఇక బాహుబలి తర్వాత ఆల్ ఇండియా మార్కెట్ ను ఆ రేంజిలో క్యాప్చర్ చేసిన కె.జి.ఎఫ్ ఈ సంవత్సరం జులై 16వ తేదీన తన సీక్వెల్ తో మరోమారు ప్రేక్షకులను పలకరించనున్నది.మొదటి పార్ట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రం రెండో పార్ట్ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో వేచి చూడాలి.
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. హీరో యష్ అభిమానులు కొందరు కె.జి.ఎఫ్ చిత్రం భారతీయ సినిమా స్థాయిని ఓ మెట్టు పైకి ఎక్కించింది.అలాంటి సినిమా సీక్వెల్ వస్తున్న నేపథ్యంలో ఆరోజున సెలవు ప్రకటిస్తే ఆ చిత్ర యూనిట్ కు మనం అండగా నిలిచిన వారిమి అవుతాం కావున ప్రధాని మోడీ గారు ఆరోజు సెలవు ప్రకటించండి అని కోరారు.
ప్రస్తుతం యష్ అభిమానుల కోరిన కోరిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి దీని మీద సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మన ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.