సిద్దిపేట పట్టణ పురపాలక సంఘం పరిధిలోని వేములవాడ కమాన్ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారం టి పి ఓ స్వామి నాయక్ ఆధ్వర్యంలో అట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగినది .
యజమానుదారునికి 3 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించని సదరు యజమాని . సిద్దిపేట పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా సిద్దిపేట పట్టణంలో అక్రమ నిర్మిస్తున్న వారి యొక్క భవన నిర్మాణములను కూల్చివేయడం జరుగుతుంది . తెలంగాణ నూతన పురపాలక సంఘం చట్టము – 2019 ప్రకారముగా ఎలాంటి నోటీసులను జారీ చేయకుండా వెంటనే నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను మరియు అక్రమ నిర్మాణాలను కూల్చివేయబడును .
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు .