సిద్దిపేట్ పోలీసు కమీషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు
తేదీ 28.10.2019 రాత్రి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందపల్లి గ్రామంలో పోలీస్ కళా బృందం కళా ప్రదర్శన కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మంత్రాలు తంత్రాలు మూఢనమ్మకాల పై రోడ్ యాక్సిడెంట్ పై, మహిళా చట్టాల పై,మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి,
మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , గురించి కళాబృందం సభ్యులు బాలు, రాజు, మల్లు, రవీందర్, తిరుమల, పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించి ప్రజలను చైతన్య పరిచారు.
ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ సాంబయ్య గ్రామ వీపీఓ రవీందర్ రెడ్డి , పాల్గొని ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ
వాహన దారులు తప్పకుండా రాష్ట్ర రవాణా శాఖ నిర్దేశించిన ప్రకారం నెంబర్ ప్లేట్ బిగించు కోవాలని తరువాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. వాహనా దారులు ట్రాఫిక్ మరియు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. మరియు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని హెల్మెట్ వాడకం.గురించి తెలిపారు,
గ్రామాలలో ఎవరైనా అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలిపారు. మరియు గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీసు స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు, గ్రామంలో ఎవరు మద్యం బెల్టు షాపులను నడపవద్దని, గుట్కాలు అమ్మ వద్దని తెలిపారు, చిన్న చిన్న తగదలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని తెలిపారు, నేరరహిత గ్రామలుగా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని వృద్ధులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. మరియు పరిచయం లేని వ్యక్తులకు మీయొక్క ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పవద్దని తెలిపినారు, గ్రామంలో ఏ సమ్యస వున్న (విపిఓ) విలేజ్ పోలీస్ ఆఫీసర్ కు తెలుపాలి లేదా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు, లేదా 100 నెంబర్ కు ఫోన్ చేయలని కమీషనర్ గారి దృష్టికి తీసుకు వచ్చే అంశం ఏదైనా ఉంటే నేరుగా వాట్సాప్ నెంబర్ 7901100100 వాట్సప్ మెసేజ్ చేయవచ్చని ఇట్టి వాట్సాప్ ను కమిషనర్ గారి పర్యవేక్షణలో పని చేస్తుందని తెలిపినారు విద్యార్థులు యువకులు చిన్నతనం నుండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాల వైపుగా అడుగులు వేయాలని సూచించారు. స్కూల్లో, కాలేజీలలో స్నేహితులతో ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని తెలిపినారు.అమ్మాయిల మహిళల భద్రత గురించి సిద్దిపేట కమిషనరేట్ లో షీటీంలు పనిచేస్తున్నాయని తెలిపినారు.
సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఏదైనా వదంతులను సృష్టించి వాట్సాప్ గ్రూప్ లో వైరల్ చేస్తే గ్రూప్ అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపినారు
మంత్రలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని వాటి గురించి వాల దగ్గరకు వీల దగ్గరకు తిరిగి డబ్బులు ఖర్చు చేసి అప్పులపాలు కావద్దని ప్రజలకు తెలిపారు, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని కార్పొరేట్ స్థాయి వైద్యం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని తెలిపినారు
నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల ప్రజాప్రతినిధుల గ్రామ పెద్దల సహకారంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గ్రామాల్లో మరియు పట్టణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వలన పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము రాజు, ఉప సర్పంచ్ పి. రాజా వెంకట్ రెడ్డి,
దుర్గారెడ్డి, కిష్టయ్య, కొమురయ్య, మరియు
గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు 350 మంది వరకు పాల్గొన్నారు.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది