ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఉప్పెన’ స్టార్ వైష్ణవ్ తేజ్ కి జంటగా శ్రీలీల ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ‘ఆది కేశవ’ పేరుతో తెరకెక్కిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి రూపొందించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. ప్రముఖ తమిళ స్వరకర్త జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా “సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటున పోయే మతి” అంటూ మొదలయ్యే పాటని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. ఆ పాట ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నంగా బుధవారం (సెప్టెంబర్ 6) ప్రోమో రిలీజ్ చేశారు. ట్యూన్, లిరిక్స్, విజువల్స్, వోకల్స్.. వెరసి ఈ పాట ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి. మరి.. ప్రోమోగా ఎంటర్టైన్ చేసిన “సిత్తరాల సిత్రావతి”.. ఫుల్ సాంగ్ గానూ మురిపిస్తుందేమో చూడాలి.