‘సలార్’ సరికొత్త రికార్డు..

Date:

ఎంటైర్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా KGFతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రమిది. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రిలో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ తో రికార్డులు సృష్టించింది. అయితే తాజాగా ఈ మూవీ నుండి మరో అప్డేట్ వచ్చింది.

అదేంటంటే, నార్త్ అమెరికాలో సుమారు 1979కి పైగా ప్రాంతాల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అమెరికాలో ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు మరిన్ని బ్లాస్టింగ్ అప్‌డేట్‌లు త్వరలోనే మీ ముందుకు వస్తాయని తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న పాన్ ఇండియా భారీ చిత్రం అమెరికాలో 27న ప్రీమియర్‌ కానుండగా, ఇండియాలో సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...