‘సలార్’ రిలీజ్.. నిర్మాతల సాహసం

Date:


సొంతంగా రిలీజ్ చేసుకుంటే తాము అనుకున్న టార్గెట్‌ను మించి ఆదాయం రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారట. తెలంగాణ వరకు సినిమాను  అనుకున్న రేటుకి అమ్మడం కష్టం కాకపోవచ్చని.. ఏపీలో ఇబ్బంది తలెత్తితే మాత్రం సొంతంగా రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. అవసరమైతే తెలంగాణలోనూ ఓన్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారట. మరి ఇది కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో చూడాలి.

ఐతే ప్రభాస్ గత మూడు చిత్రాల తాలూకు చేదు అనుభవాల దృష్ట్యా ‘సలార్’ను అంతేసి రేట్లు పెట్టి కొనడంపై డిస్ట్రిబ్యూటర్లు తటపటాయిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా నిండా మునగడం ఖాయమని అనుకుంటున్నారు. ఐతే తాము కోరుకున్న రేట్లు రాకపోతే కమిషన్ బేసిస్ మీద సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి ‘సలార్’ నిర్మాతలు వెనుకాడట్లేదట. ప్రభాస్ గత సినిమాలతో దీనికి పోలిక లేదని.. ఇది మినిమం గ్యారెంటీ సినిమా అని.. ‘కేజీఎఫ్’ను మించి అద్భుతాలు చేస్తుందని.. ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటాయని వాళ్లు భావిస్తున్నారట.

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం, ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో ‘సలార్’ మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే ఉండవని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సిినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిజినెస్ కూడా ఒక రేంజిలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. హైప్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకునే క్రమంలో అసాధారణ రేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ-తెలంగాణకు కలిపి రూ.200 కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్నారట నిర్మాతలు.

ఇండియన్ సినిమాలో తర్వాతి బిగ్ రిలీజ్ అంటే.. ‘సలార్’యే. గత నెలలో ‘ఆదిపురుష్’ మూవీతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఒక వీకెండ్ పాటు సందడి తీసుకొచ్చిన ప్రభాస్.. ‘సలార్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అనుకుంటున్నారు. వివిధ భాషల్లో ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ‘సలార్’ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేస్తే ఒక రెండ్రోజుల పాటు సోషల్ మీడియా వేడెక్కిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...