సముద్రఖని ప్లానింగ్ .. పవన్ షాక్ 

Date:


ఈ సినిమా కోసం పవన్ కేవలం 21 రోజులు పని చేశారని , కొన్ని రోజులు మధ్యాహ్నమే ఆయనని ఘాట్ నుండి పంపించేసేవాడినని తెలిపాడు. 50 , 60 రోజుల్లో చేయాల్సిన వర్క్ ను తమ ప్లానింగ్ తో చాలా తక్కువ రోజులకే పూర్తి చేశామనన్నారు. అంతే కాదు పవన్ ఫస్ట్ టైమ్ లొకేషన్ లోనే నెక్స్ట్ సీన్ కోసం షర్ట్ మార్చేశారని , ఆయన కూడా ఎక్కడా టైమ్ వృధా కాకూడదని భావించి వర్క్ చేశారని చెప్పుకున్నారు సముద్రఖని. పవన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి కథ చెప్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

ఇక స్క్రిప్ట్ నరేషన్ అవ్వగానే షూటింగ్ ఎప్పటి నుండి అనుకుంటున్నారు ? అనే ప్రశ్న పవన్ నుండి వచ్చిందని, దానికి రేపటి నుండే అంటూ తను సమాధానం ఇచ్చే సరికి ఆయన షాక్ అయ్యాడని, నాకు రెండు మూడు రోజులు టైమ్ ఇవ్వమని పవన్ అడిగారని , అప్పటికే సెట్ , అన్నపూర్ణలో నాలుగు ఫ్లోర్స్ తో పక్కా ప్లానింగ్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసేశామని సముద్రఖని చెప్పుకున్నాడు. 

‘బ్రో’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది టీం. ముందుగా హీరోయిన్స్ ఆ తర్వాత తేజ్. తమన్  మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు దర్శకుడి వంతు. సినిమా ఫస్ట్ కాపీ చెకింగ్ చేస్తున్న దర్శకుడు తాజాగా మీడియా ముందుకొచ్చి ‘బ్రో’ సినిమా విశేషాలు పంచుకున్నాడు. ముందుగా ఈ కథ త్రివిక్రమ్ గారికి చెప్తే , మీరే హీరోగా చేస్తారా ? అని అడిగారని ,కోవిడ్ టైమ్ లో తమిళ్ లో ఏ హీరో ముందుకు రాకపోతే తనే తప్పక చేశానని ఆయనకి కన్వే చేశానని అప్పుడు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ తో చేస్తారా ? అనేసరికి తనకి నోటి నుండి మాట రాలేదని తెలిపాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...