యశోద సినిమాకు ఆమె 3.5 నుంచి 4 కోట్ల రూపాయల దాకా పారితోషికం అందుకున్నారు. ఆ లెక్కన ఏడాదికి మూడు సినిమాలు చేసినా 12 కోట్ల దాకా లాస్ అవుతారన్నది టాక్. యశోద సినిమా చేస్తున్నప్పుడే మయోసైటిస్ భారిన పడ్డారు నటి సమంత. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ కోసం ట్రీట్ మెంట్ తీసుకోవడానికి త్వరలోనే యు.ఎస్. వెళ్తారన్నది టాక్. విడీ అండ్ వీడీతో ఆమె చేసిన ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమా చేస్తున్నారు సమంత. హిందీలో వరుణ్ ధావన్‌తో సిటాడెల్ ప్రాజెక్టులో చేశారు. కొన్నాళ్ల పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చిన సమంత, తన హీలింగ్ జర్నీని కంప్లీట్ చేసుకుని త్వరలోనే తిరిగిరావాలని కోరుకుంటున్నారు ఆమెతో పనిచేసిన వారు.