అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత ఖాళీ దొరికితే ఆధ్యాత్మిక భావనలు కలిగించే దేవాలయాలు, మెడిటేషన్ సెంటర్లు, టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్తోంది. ఈషా ఫౌండేషన్ కి కూడా రీసెంట్ గానే వెళ్ళింది సమంత. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్ ని తగ్గించుకుంటూ ఆనందంగా ఉంటోంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా తన ఫ్రెండ్ తో కలిసి బాలి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ దిగిన ఫొటోస్ ని తన పేజీలో పోస్ట్ చేసింది. బాలిలోని మంకీ ఫారెస్ట్ కి వెళ్ళింది. అక్కడ నేచర్ ని, అందమైన లొకేషన్స్ ని కేప్చర్ చేసింది. అలాగే ఒక కోతితో కూడా క్యూట్ సెల్ఫీ ఒకటి దిగి పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో సమంత ఆనందం చూస్తుంటే మాములుగా లేదు. అవి చూసిన ఫ్యాన్స్ బాగా హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘చాలా రోజుల తర్వాత సమంతను ఇంత హ్యాపీగా చూస్తున్నాం’, ‘అబ్బా ఆ కోతి ఎంత లక్కీ,సమంతతో కలిసి సెల్ఫీ దిగే అదృష్టం దొరికింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.