ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన.
వైసీపీ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పార్టీ వ్యవహారాలను చాలావరకు పర్యవేక్షిస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు నియోజకవర్గంలో సైతం వైసీపీ పార్టీ గెలవటంలో మంత్రి పెద్దిరెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు.
పరిస్థితి ఇలా ఉండగా చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు.బి కొత్తపేట పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఎస్సీలను అవమానించేలా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారని మాజీ జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి విచారించిన న్యాయస్థానం ఈ మేరకు.
ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కేసుకు సంబంధించి విచారణ నివేదిక అందించాలని చిత్తూరు కోర్టు పోలీసులను ఆదేశించడం జరిగింది.ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.