అలాగే ఈ మధ్య షోరూమ్స్ ఓపెనింగ్ ఫంక్షన్స్ కి బాగా అటెండ్ అవుతోంది. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే చాలు అనసూయ తన ఫ్యామిలీ ని తీసుకుని విదేశాలకు చెక్కేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. యూఎస్ కి వెళ్లిన అనసూయ అక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , ఘిరాడెల్లి స్క్వేర్ దగ్గర తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.”మనం పర్సనల్ గా ఒంటరిగా గడిపే సమయం కంటే ఫామిలీతో సమయం గడిపితే చాలా బెస్ట్” అంటూ ఒక కాప్షన్ పెట్టుకుంది. ఇక అనసూయ పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అనసూయ అభిమానులు… ఎంజాయ్ ది ట్రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వెకేషన్ లో తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజులు ఇచ్చింది..ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాల జోలికి కూడా వెళ్లడం లేదు. ఇక అలాంటి విషయాలను పట్టించుకోను అని గతంలో చెప్పేసింది.