వినాయకుడికి డబ్బింగ్ సినిమాల నైవేద్యం

Date:


అసలు ఖుషి ఇప్పుడు వచ్చింటే బాగుండేదన్న కామెంట్ నిజమే అనిపిస్తుంది. జవాన్ జోరు గట్టిగానే ఉన్నా 15వ తేదీకి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చల్లారిపోయి ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు స్ట్రెయిట్ మూవీ అయితే పెద్ద అడ్వాంటేజ్ దక్కేది. ఇప్పుడది చేతులారా వదిలేసుకున్నట్టయ్యింది. 16న మలయాళం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఆర్డిఎక్స్ ని డబ్ చేసి వదిలే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవీన్ కుమార్(అభయ్ బేతిగంటి)హీరోగా స్వీయ దర్శకత్వంలో తీసుకున్న రామన్న యూత్ రేస్ లో ఉంది కానీ పాపం ప్రమోషన్ సమస్య వల్ల అదొస్తున్న సంగతే పబ్లిక్ కి చేరలేదు. ఈ రకంగా ఓ కీలక పండగ అనువాదాలకు కర్పూరమయ్యింది. 

తీరా చూస్తే ఉదయం గణపతికి పూజ చేసుకుని సరదాగా కొత్త సినిమా కోసం థియేటర్లకు వెళదామంటే కేవలం రెండే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. లారెన్స్ చంద్రముఖి 2 మీద ఆల్రెడీ విచిత్రమైన బజ్ ఉంది. రెండు దశాబ్దాల క్రితం రజనీకాంత్ చేసిన కథనే మళ్ళీ రీమేక్ చేశారనే విధంగా ట్రైలర్ కట్ చేయడంతో రకరకాల అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకున్న బ్రాండ్ ఇమేజ్, మాస్ లో లారెన్స్ కున్న పట్టు ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే తెస్తాయి. ఇక విశాల్ హీరోగా టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన గ్యాంగ్ స్టర్ డ్రామా మార్క్ ఆంటోనీ సైతం మంచి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

రెండు పిల్లులు రొట్టె కోసం పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో తీర్పు చెప్పడానికి వచ్చిన పిల్లి దాన్ని ఎగరేసుకుని పోయిందంట. అచ్చంగా మన టాలీవుడ్ రిలీజ్ డేట్ల వ్యవహారం అలాగే ఉంది. సలార్ వాయిదా చిత్ర విచిత్ర పరిణామాలకు దారి తీసి కీలకమైన గణేష్ పండగకు టాలీవుడ్ బాక్సాఫీస్  తరఫున డబ్బింగ్ సినిమాల నైవేద్యం పెట్టేలా చేసింది. అసలీ గొడవే లేకపోయి ఉంటే శుభ్రంగా స్కంద సెప్టెంబర్ 15 వచ్చేసి మంచి వీకెండ్ తో పాటు ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకునేది. సలార్ వదిలేసిన తేదీ మీద ఆశపుట్టడంతో హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...