విజయ్ దేవరకొండ ‘VD13’ షూటింగ్ షురూ.. రిలీజ్ ఎప్పుడంటే ?

Date:





గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. VD13 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే యుఎస్‌ఎలో లొకేషన్ రెక్కీని పూర్తి చేసి త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను షేర్ చేసారు మేకర్స్. అంతేకాదు “మా #VD13 #SVC54 కిక్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. సంక్రాంతి 2024కి సరైన ఎంటర్‌టైనర్‌గా మీకు హామీ ఇస్తున్నాము” అని ఆ పోస్టర్ పై రాసారు. ఇకపోతే సీతా రామం చిత్రంతో తెలుగులో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈసినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...

మొన్నటి వరకూ కేంద్రాన్ని దునుమాడి.. ఇప్పుడు నోరెత్తని సీఎం

– కార్మికపక్షంపై నిరంకుశత్వం– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ...

మతతత్వంతో దేశ విభజన! –

– మతానికి రాజకీయాన్ని జోడిస్తున్న బీజేపీ– మణిపూర్‌ మారణహోమంతో దేశ...

సర్కార్‌ బెదిరింపులకు అంగన్‌వాడీలు భయపడరు

– 26న ఇందిరాపార్కు వద్ద ధర్నా – కేసీఆర్‌కూ చంద్రబాబు గతే.....