వర్షాకాలంలో జుట్టు రాలడం( hair loss ) అన్నది ఒక సాధారణ సమస్య.వాతావరణంలో ఎక్కువ తేమ కారణంగా తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు, తల దురద, లాంటి సమస్యలు పెరుగుతాయి.
ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.అంతేకాకుండా ఈ సీజన్లో జుట్టు చాలా త్వరగా జిడ్డుగా మారిపోతుంది.
దీంతో చాలామంది తరచుగా తమ జుట్టును కడగడం, షాంపు చేసుకోవడం, తల స్నానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.దీని వలన కూడా మీ జుట్టు ఆరోగ్యం చెడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది.
అయితే ఇలా చేయడం వలన సహజమైన నూనెలు కోల్పోవచ్చు.ఇది జుట్టును పొడి బారినట్లు చేస్తుంది.

దీంతో జుట్టు చిట్లి పోవడం, వెంట్రుకలు రంగు మారడం, ఊడిపోవడం లాంటి సమస్యలు జరుగుతాయి.వర్షాకాలంలో( rainy season ) ఉండేటు వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలంటే శరీరంలాగే మీ జుట్టు కూడా ప్రత్యేక శ్రద్ధ, అదనపు మోతాదులో పోషకాలు చాలా అవసరం.సరైన ఆహారం తీసుకోవడం వలన మీ వెంట్రుకల కుదుళ్ళ పోషణ బలాన్ని చేరుకూర్చవచ్చు.అవి విరిగిపోకుండా నిరోధించవచ్చు.ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మీరు తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.అయితే విటమిన్ ఏ, సి, డి, ఈ, జింక్, ఐరన్, బయోటిన్, ప్రొటీన్లు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను మీ ఆహార పదార్థాలలో చేర్చుకోవడం మంచిది.
వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని నివారించాలంటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించాలంటే ఈ పోషకాలన్నీ చాలా అవసరం.

అయితే పాలకూరతో చేసే సూప్ తాగడం, పాలకూరను( spinach ) తినడం లాంటిది చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.ఎందుకంటే పాలకూరలో జుట్టుకు కావలసిన పోషకాలు ఎన్నో ఉన్నాయి.పప్పులు, కాయ ధాన్యాలు మీ రోజు వారి ఆహారంలో తప్పకుండా ఉండాలి.
మరి ముఖ్యంగా మీ డైట్ లో కాయధాన్యాలను చేర్చుకోవడం వలన ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్ లాంటి పోషకాలు లభించి అవి జుట్టును బలోపేతం చేస్తాయి.అలాగే జుట్టు తిరిగి పెరగడానికి ప్రోత్సహిస్తాయి.
ఇదే విధంగా వాల్ నట్స్, పెరుగు, ఓట్స్, స్ట్రాబెరీలు, చిలకడదుంప లాంటివన్నీటిలో జుట్టుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి.అందుకే వీటిని మీ డైట్ లో చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
