వరుణ దేవుడి ప్రభావం – బ్రో ఆలస్యం

Date:


యావరేజ్ గా తొమ్మిదికి మొదలుపెట్టినా అవసరం లేని తతంగాలతో సమయం వృథా చేయకుండా నేరుగా స్పీచులతోనే వేగంగా నడిపించేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించొచ్చు. అయితే త్రివిక్రమ్, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు మంచి గూస్ బంప్స్ ఇచ్చేలా మాట్లాడతారని ఎదురు చూస్తున్న వాళ్లకు మాత్రం నిరాశ తప్పకపోవచ్చు. వర్షం అడ్డంకి లేకపోయి ఉంటే అవన్నీ జరిగేవే. ఎంత ఫాస్ట్ గా చేసినా అర్ధరాత్రి అవుతుంది కాబట్టి యాంకర్లు, డాన్సర్ల విన్యాసాలు లేకుండా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తరహాలో వేడుకని ముగించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. 

అందుకే ముందు జాగ్రత్త చర్యగా లేట్ గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్, హరీష్ శంకర్ తదితరులు అతిథులుగా హాజరు కాబోతున్నారు. మైత్రి అధినేతలు, సూర్య మూవీస్ ఏఎం రత్నం, డివివి దానయ్య వచ్చే ఆవకాశాలున్నాయి. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ అభిమానులు ఇప్పటికే తండోపతండాలుగా ఈవెంట్ దగ్గరకు చేరుకున్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్ సైడ్ కోసం త్వరగా వచ్చేశారు. అయితే వీళ్ళందరికీ ముందే సిద్ధపడకపోయినా సుదీర్ఘమైన వెయిటింగ్ తప్పదు.

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వరుణ దేవుడు పెద్ద పరీక్షే పెడుతున్నాడు. సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం అనూహ్యంగా వాయిదా పడుతూ 6 నుంచి రాత్రి 8.30 గంటలకు షిఫ్ట్ అయిపోయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో పోలీసుల సూచనల మేరకు ఆలస్యంగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. హైటెక్ సిటీ ప్రాంతం కాబట్టి ఆఫీసులు వదిలే టైంకి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. దానికి బ్రో ఫ్యాన్స్ హడావిడి తోడైతే రోడ్ల మీద రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...