లగడపాటి శ్రీధర్ “స్టైల్”
విడుదలై నేటికి 15 ఏళ్ళు!!
మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున
స్పెషల్ అప్పిరియన్స్ ప్రత్యేక ఆకర్షణ
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో తనకంటూ ప్రత్యేకమైన “స్టైల్” కలిగిన నిర్మాతల్లో లగడపాటి శ్రీధర్ ఒకరు. కేవలం లాభాపేక్షతో కాకుండా… తను నిర్మించే ప్రతి సినిమా సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడాలని తపించే లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘స్టైల్’ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 15 ఏళ్ళు.
ప్రభుదేవా, రాఘవ లారెన్స్, జయసుధ, రాజా, ఛార్మి, కమలిని ముఖర్జీ ముఖ్య తారాగణంగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 12-1-2006లో విడుదలై ఘన విజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున పోషించిన ప్రత్యేక అతిధి పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కబీర్ లాల్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. మదర్ సెంటిమెంట్ కు పాజిటివ్ ఆటిట్యూడ్ జోడించి.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే డాన్సులతో.. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల దృక్పధం ఆవశ్యకతను వివరిస్తూ.. తెరకెక్కిన ఈ చిత్రం క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా నేటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఈ చిత్రం తమిళంలో ‘లక్ష్యం’ పేరుతో అనువాదమై అక్కడ కూడా మంచి విజయం నమోదు చేసింది!!
లగడపాటి శ్రీధర్ “స్టైల్”
విడుదలై నేటికి 15 ఏళ్ళు
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES