రోజూ ఎంతోమంది రైళ్లల్లో ప్రయాణం( Train Journey ) చేస్తూ ఉంటారు.అయితే రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు నాణ్యమైన ఫుడ్ లభించదు.
అంతేకాకుండా ట్రైన్లలో విక్రయించే ఫుడ్ ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి.ట్రైన్లల్లో ఎక్కువ రేటుకు ఆహార పదార్థాలు( Food ) అమ్ముతూ ఉంటారు.
నాణ్యత లేకపోవడం, ఎక్కువ ధర ఉండటం వల్ల చాలామంది కొనుగోలు చేయరు.అంతేకాకుండా ట్రైన్లల్లో విక్రయించే ఆహార పదార్థాలు అంత రుచికరంగా కూడా ఉండవు.
దీంతో రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఇంటి నుంచి భోజనం, ఇతర ఆహార పదార్దాలు తీసుకెళతారు.

ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ ( IRCTC ) కీలక నిర్ణయం తీసుకుంది.రైళ్లల్లో ప్రయాణికులకు మంచి ఆహారం తక్కువ ధరకే అందుబాటులో ఉంచేందుకు కొత్త విధానం తీసుకొచ్చింది.రైల్వేస్ జనతా ఖానా( Railway Janta Khana ) పేరుతో డివిజనల్ యూనిట్లను రైల్వే బోర్డు ప్రారంభించింది.
అయితే ప్రస్తుతం ఈ సర్వీస్ నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్‌లో మాత్రమే ఉంది.అయితే దీనిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.దీని ద్వారా ఐఆర్‌సీటీసీ రూ.20,రూ.50కే మంచి భోజనం అందించనుంది.

7 పూరీలు, పొటాటో వెజిటుబుల్స్, ఊరగాయ వంటి ఐటెమ్స్ తో అందించే ఆహారం రూ.20కే లభించనుంది.ఇక రూ.50 ప్యాక్ విషయానికొస్తే.అందులో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి ఉంటాయి.అలాగే ఐఆర్‌సీటీసీ 200 మిల్లీ లీటర్ వాటర్ బాటిల్ ను రూ.3కే ప్రయాణికులకు అందించనుంది.ఈ కొత్త విధానం అన్ని రైల్వే జోన్లల్లో అమల్లోకి వస్తే ప్రయాణికులకు అతి తక్కువ ధరకే ఫుడ్ లభించనుంది.రైళ్లల్లో ప్రయాణించే పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.
త్వరలో ఈ విధానాన్ని అన్ని రైల్వే జోన్లను విస్తరించనున్నారు.ఇది రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.
