రైడ్ ఎందుకు మాస్ మహారాజా

Date:


ఇప్పుడు ఏరికోరి అదే చేయడం అభిమానులకు ఇష్టం లేదు. హరీష్ శంకర్ ఎంత రీమేక్ ఎక్స్ పర్ట్ అయినా సరే రైడ్ లాంటివి వద్దని కోరుతున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఈ ప్రాజెక్టుని టేకప్ చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దగ్గర రైడ్ హక్కులైతే ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. వేగంగా తీయాలంటే కొత్త కథలతో కసరత్తు చేసేందుకు టైం లేదు . అందుకే ఇతర భాషల్లో హిట్ అయిన వాటిని రీమేక్ చేసుకుంటే సేఫ్ గేమ్ అవుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లే వరసగా వీటిని ఎంచుకున్నప్పుడు రవితేజను మాత్రమే అడిగి లాభం లేదు. అఫీషియలయ్యే దాకా చూడాలి 

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అజయ్ దేవగన్ రైడ్ రీమేక్ గా ఇది రూపొందనుందనే వార్త ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తోంది. ఇది మంచి సినిమానే కానీ మూవీస్ లవర్స్ అందరూ చూసేశారు. మక్కికి మక్కి కాకపోయినా సూర్య హీరోగా వచ్చిన గ్యాంగ్ తో కొంచెం దగ్గర పోలిక ఉంటుంది. నగరంలో పలుకుబడి ఉన్న పెద్దమనిషి ఇంటికి ఇన్కమ్ టాక్స్ రైడింగ్ కోసం వచ్చిన ఆదాయపు పన్ను అధికారి ఎదురుకునే పరిణామాల నేపథ్యంలో రైడ్ సాగుతుంది. హిందీలో పెద్ద హిట్టు కొట్టింది. 2018 టాప్ గ్రాసర్స్ గా నిలిచింది. ఎవరెవరితో రీమేక్ అనుకున్నారు కానీ సాధ్యపడక ఆరేళ్ళు గడిచిపోయాయి.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు టైం కేటాయించడం పెద్ద సమస్యగా మారింది. ఒక్క ఓజికి మాత్రమే అవకాశం ఉన్నప్పుడు డేట్లు ఇచ్చి ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లును వచ్చే ఏడాది ఎలక్షన్లయ్యాక కొనసాగించేలా చర్చలు జరుగుతున్నాయట. ఇటీవలే నిర్మాత ఏఎం రత్నం ఎంత లేట్ అయినా పవన్ కోసం ఎదురు చూస్తామని చెప్పడం ఆల్రెడీ వైరల్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి ఉస్తాద్ దర్శకుడు హరీష్ శంకర్ రవితేజతో ఓ ప్రాజెక్టు పూర్త చేయాలనే ప్లాన్ లో స్క్రిప్ట్ రాస్తున్నాడని ఆల్రెడీ టాక్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...