కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించేందుకు స్వీకరించింది.ఈ మేరకు ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈనెల 21న చేపడతామని పేర్కొంది.
పరువు నష్టం దావా కేసు నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాహుల్ పిల్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణ చేస్తామని వెల్లడించింది.