Thursday, August 18, 2022
HomeEntertainmentMovie Updatesరానా 'విరాట‌ప‌ర్వం' షూటింగ్ పునఃప్రారంభం

రానా ‘విరాట‌ప‌ర్వం’ షూటింగ్ పునఃప్రారంభం

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘విరాటప‌ర్వం’. ‘నీది నాది ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం హిస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్పిస్తుండ‌గా, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఒక చిన్న షెడ్యూల్ మిన‌హా ‘విరాట‌ప‌ర్వం’ షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. మిగిలిన పోర్ష‌న్‌కు సంబంధించి ఇటీవ‌లే షూటింగ్ పునఃప్రారంభ‌మైంది. రాత్రిపూట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొంటున్నారు.

ఒక విభిన్న త‌ర‌హాతో, కంటెంట్ ప్ర‌ధానంగా రూపొందుతున్న ‘విరాట‌ప‌ర్వం’లో ఇప్ప‌టివ‌ర‌కూ తాము పోషించ‌ని త‌ర‌హా పాత్ర‌ల‌ను రానా, సాయిప‌ల్ల‌వి పోషిస్తున్నారు.

ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్ర‌ధారులైన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments