5.1 C
New York
Saturday, March 25, 2023
HomeNews"రాగల 24 గంటల్లో" చిత్రం వందరోజులు ఆడాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.. తితిదే బోర్డ్...

“రాగల 24 గంటల్లో” చిత్రం వందరోజులు ఆడాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.. తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

“రాగల 24 గంటల్లో” చిత్రం వందరోజులు ఆడాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.. తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, మామా మంచు అల్లుడు కంచు,  ఢమరుకం, వంటి హిట్ చిత్రాలను రూపొందించిన శ్రీనివాస్ రెడ్డి “రాగల 24 గంటల్లో” వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వస్తోన్నారు..  సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా ఈ చిత్రంలో నటించారు.  శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై  నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.  షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం  అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రఘు కుంచె సంగీతాన్ని అందించారు.  కాగా ఈ చిత్రంలోని హీరోయిన్ ఇంట్రడక్షన్  “నారాయణతే నమో నమో” లిరికల్ వీడియో  పాటని తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి లాంచ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలవుతున్నాయి. అంతకు ముందు వై.వి. సుబ్బారెడ్డికి  వేదపండితుల మంత్రోచ్ఛారణతో చిత్ర యూనిట్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఆలీ, చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, సంగీత దర్శకుడు రఘు కుంచె, పాటల రచయిత శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ఎడిటర్ తమ్మిరాజు, నటులు కృష్ణభగవాన్, రఘుబాబు,  రవి ప్రకాష్, కెమెరామెన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్ యస్ కుమార్, హాజరయ్యారు. అనంతరం ముఖ్యఅతిధిగా విచ్చేసిన తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి గారిని శాలువా, ఘజమాలతో సత్కరించి, సన్మాన పత్రాన్ని అందించారు..చిత్ర యూనిట్.

తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి 20 సంవత్సరాలనుండి స్నేహితుడు. వెంకటేశ్వర స్వామి వారి కీర్తన పాటని నాతో ఎందుకు రిలీజ్ చేయించారో పాట చూశాక నాకు అర్థం అయింది. పాటని విజువల్ గా  చక్కగా చిత్రీకరించారు. మంచి హిట్ అవుతుంది. దానికి మించి రెండింతలు సినిమా కూడా పెద్ద  హిట్ అవుతుంది. ఆలీ, రఘుబాబు, మా పార్టలో వున్నారు. వారందరి సూచనలతో  ఆంద్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి అన్నివిధాలుగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా వున్నారు..  ఈ సినిమా వందరోజులు ఆడాలని.. నిర్మాత శ్రీనివాస్ కు, నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డికి మంచి జరగాలని..  ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.. అన్నారు.

మాటల రచయిత, నటుడు కృష్ణభగవాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అన్నీ కలిసొస్తున్నాయ్.. సినిమా బాగా వచ్చింది. మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా ప్రేక్షకులు హిట్ చేస్తారని నమ్మకం ఉంది. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పెద్ద బ్రేక్ అవుతుంది.. అన్నారు.

కమెడియన్ రఘుబాబు మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి సినిమా అంటే మేమంతా ఉంటాము. టీజర్ చాలబాగుంది. సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. సుబ్బారెడ్డిగారు ఈ ఫంక్షన్ కి రావడం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ సినిమాకి తప్పకుండా  వుంటాయని ఆశిస్తున్నా.. అన్నారు.

ఆలీ మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి ఫస్ట్ సినిమా  ఆశాడం పెళ్ళికొడుకు. నాకు 9వ సినిమా హీరోగా. అప్పట్నుంచి మా జర్నీ కొనసాగుతుంది. మంచి సినిమాలు తీశారు. కొద్దికాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు. ఆయన మీద ప్రేమతో సుబ్బారెడ్డిగారు ఫస్ట్ టైం వచ్చి పాట లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.డెఫినెట్ గా ఈ చిత్రం సక్సెస్ అవుతుంది.. అన్నారు.

 నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ.. రామానాయుడు, దిల్ రాజు గారి ఇన్స్పిరేషన్ తో నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చాను. శ్రీనివాసరెడ్డి లాంటి మంచి మిత్రుడుతో ఈ సినిమా నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…20 ఏళ్లుగా  నా దైవం, పితృసమానులు సుబ్బారెడ్డి గారితో నా అనుబంధం కొనసాగుతుంది. దివంగత నేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం ఆ కుటుంబానికి, పార్టీకి వెన్నుమూకగా ఉండి ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డి గారు.  మా చిత్రంలోని పాటను ఆయనే రిలీజ్ చెయ్యాలని వైట్ చేశాం. అది ఈరోజు జరిగింది. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు దీవెనలు మాకు వుంటాయని ఆశిస్తున్నా.. యస్విబిసి బోర్డ్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు నాకు అప్పగించారు.. వారు నామీద పెట్టిన నమ్మకానికి నిజాయితీగా పనిచేసి మంచిపేరు వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నాను..అన్నారు.

*సత్యదేవ్, ఈషా రెబ్భ, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వై.శ్రీనివాస్ వర్మ, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, పాటల రచయితలు: భాస్కరభట్ల, శ్రీమణి, డిఓపి: గరుడవేగ అంజి, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: తమ్మిరాజు, ఫైట్స్: విక్కీ, డాన్స్: స్వర్ణ, భాను, లైన్ ప్రొడ్యూసర్: యం. ఎస్. కుమార్, ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: శ్రీనివాస్ రెడ్డి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments