రజినీ సినిమాలో నాని.. నిజమేనా?

Date:


‘హాయ్ నాన్న’ తర్వాత నాని కొత్త సినిమాను ఇంకా ప్రకటిచంలేదు. అతను ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌తోనే మరో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ లోపు రజినీ సినిమాలో స్పెషల్ రోల్ గురించి న్యూస్ బయటికి వచ్చింది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ‘హాయ్ నాన్న’ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ఇంతకుముందు రజినీతో ‘2.ఓ’ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు నానిని ఎంచుకున్నాడట జ్ఞానవేల్. ‘జై భీమ్’ చూశాక జ్ఞానవేల్‌తో పని చేయడానికి ఏ నటుడైనా ఆసక్తి చూపిస్తాడు. పైగా రజినీకాంత్‌తో కలిసి నటించడం అన్నా కూడా అదొక గొప్ప అవకాశమే. కాబట్టి నానికి నిజంగా ఈ ఆఫర్ వస్తే అతను కాదనే అవకాశమే లేదు. డేట్ల సమస్య ఉన్నా కూడా ఎలాగోలా సర్దుబాటు చేస్తాడనడంలో సందేహం లేదు.

ఐతే తమిళంలో నానికి మళ్లీ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఇప్పుడు అతడి తలుపు తట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్.. సూపర్ స్టార్‌తో జట్టు కట్టబోతున్నాడట. రజినీకాంత్ కొత్త చిత్రంలో నాని ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ స్టార్.. ‘జై భీమ్’ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

నేచురల్ స్టార్ నాని టాలెంట్ తమిళ ప్రేక్షకులకు చాలా ఏళ్ల ముందే తెలుసు. ‘ఈగ’ తమిళంలో కూడా బాగానే ఆడింది. దాంతో పాటు ‘సెగ’ సినిమాతో తమిళ ప్రేక్షకులను నేరుగానే పలకరించాడు నాని. అక్కడ మంచి గుర్తింపు లభించినప్పటికీ.. తర్వాత తమిళం మీద అతను పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ‘దసరా’ చిత్రంతో తమిళంలోకి వెళ్లే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...

శ్రీలీల సెలవుపై రామ్ పేలిపోయే కామెంట్

రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల...