
సూర్య తమ్ముడిగా తెలుగు ప్రజలకు పరిచయమైన కార్తి అనతి కాలంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో సూర్య కంటే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
తాజాగా ఖైదీ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న కార్తి. ఈరోజు తన కొత్త సినిమా సుల్తాన్ టీజర్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు..ఈ చిత్రంలో కార్తీకి జోడిగా రష్మిక మందాన నటించనున్నది.ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన గతంలో శివ కార్తికేయన్,కీర్తి సురేష్ జంటగా నటించిన రెమో చిత్రానికి దర్శకత్వం వహించి సూపర్ హిట్ ను అందుకున్నారు.ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులను నవ్వించడానికి అన్ని తమిళ్ సినిమాలలో కనిపించినట్లు ఈ చిత్రంలో కూడా యోగి బాబు మనకి కనిపించనున్నారు.ఈ చిత్రంతో రష్మిక మందాన తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అలాగే థియేటర్స్ ఫుల్ అక్యూపెన్సీ కు అనుమతులు దొరకడంతో ఇన్నిరోజులు తమ రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్న చిత్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాయి.
#SulthanTeaser Tamil #SulthanFromApril2#சுல்தான்#JaiSulthan