కేరళకు చెందిన సుమ మాతృ భాష తెలుగు కానప్పటికి, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు.. తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంటుంది. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె యాంకరింగ్ రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే షోస్ తో మంచి పాపులరీటి తెచ్చుకుంది. ఏ ఆడియో ఫంక్షన్ అయిన సరే సుమ యాంకరింగ్ చెయ్యాలిసిందే.