“ఒక యూనియన్ సినిమా ఇండస్ట్రీలోని అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తే సంతోషంగా ఉంది. మామూలుగా మా సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా మీ జర్నలిస్టులంతా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బావుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్యూ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఇకపై కలుస్తూనే ఉంటా..” అన్నారు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్నా. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు రష్మిక ముఖ్య అతిథిగా హాజరై ఫిల్మ్ జర్నలిస్టులకు 2023-24 సంవత్సరానికి కార్డులను అందజేశారు.