మీమ్స్ కోసం స్టఫ్ దొరికేసింది బ్రో  

Date:


క్షణాల్లో ఇవన్నీ ట్విట్టర్ అదే ప్రస్తుతం ఎక్స్ గా పేరు మార్చుకున్న సోషల్ మీడియాలో దిగిపోయాయి. ఆలస్యంగా ప్రారంభమై బయట వర్షం పడుతున్నా అభిమానులు లెక్క చేయకుండా తండోప తండాలుగా వచ్చారు. వాళ్ళను నిరాశ పరచకుండా పవన్ అరగంటకు పైగానే మాట్లాడ్డం మంచి జోష్ ఇచ్చింది. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇంకో రెండే రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందాల కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్  కొంత ఆలస్యంగా మొదలుపెట్టడం షాక్. తెలంగాణ, ఏపీలో క్రమంగా ఆన్ లైన్ బుకింగ్ లో స్క్రీన్లు పెంచుతున్నారు.

ఇవే కాదు తమన్ ప్రాంగణంలోకి వచ్చాక వెరైటీగా నమస్కారం పెట్టడం, బ్రహ్మానందం మాట్లాడుతూ పవన్ ని ఐ లవ్ బ్రో అంటూ పదే పదే చెబుతూ నవ్వులు పూయించడం ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. పవన్ స్పీచ్ మధ్యలో వైష్ణవ్ తేజ్ వెనుక నుంచి చెవిలో ఏదో చెప్పబోతే నాకు గుర్తుందంటూ పవన్ కాసింత సీరియస్ గా చూడటం బాగుంది. ఇలా ఆహ్లాదకమైన హాస్యంతో వేడుక చక్కని టైం పాస్ చేయించింది. పవన్, తేజు, తమన్ ముగ్గురు కలిసి తమ్ముడు పంచె గెటప్ లో కిల్లి కిల్లి సాంగ్ కి డాన్సు చేసిన వీడియోని ప్లే చేయడం ఊహించని స్పెషల్ సర్ప్రైజ్.

బ్రో వేడుకలో సోషల్ మీడియాకు కావాల్సిన మీమ్స్ స్టఫ్ పుష్కలంగా దొరికేసింది. కొన్ని సరదా సన్నివేశాలు, ఫన్నీ మూమెంట్స్ వీడియోల రూపంలో వాడేసుకుని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ కు బంధువైన టిజి వెంకటేష్ తన ప్రసంగంలో టీమ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ పొరపాటున సముతిరఖనిని సముద్రాలు, తమన్ ని తమన్నా, సాయి తేజ్ ని ధర్మతేజ, కేతిక శర్మని కీర్తి శర్మగా సంబోధించడంతో నవ్వులు విరిశాయి. కిందపడ్డ మైకుని తీసుకోబోతున్న సాయితేజ్ పక్కనే ఉన్న తమన్ తనకు నమస్కారం చేయబోతున్నట్టు ఫీలై వారించడం పేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...