Monday, August 15, 2022
HomeEntertainmentMovie Updatesమిస్టర్ అండ్ మిస్ మెస్మరైజ్ చేస్తారు! - మధుర శ్రీధర్ రెడ్డి

మిస్టర్ అండ్ మిస్ మెస్మరైజ్ చేస్తారు! – మధుర శ్రీధర్ రెడ్డి



రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ పతాకంపై శైలేష్ సన్ని,
జ్ఞానేశ్వరి కండ్రేగుల జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం “మిస్టర్ & మిస్”. రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా చిత్రం ట్రైలర్ ను మధుర శ్రీధర్ విడుదల చేశారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ… నాకు ఇష్టమైన దర్శకుల్లో అశోక్ ఒకరు. చాలా కష్టపడతాడు.
“ఓ స్త్రీ రేపు రా” అనే సినిమా తీశాడు. తను హిందీలో కూడా ఆ కాన్సెప్ట్ను తీసుకోవడం జరిగింది. ఎప్పుడూ తను కొత్త కాన్సెప్ట్ తో వస్తుంటాడు. అలా వచ్చిన కొత్త కాన్సెప్టే ఈ “మిస్టర్ అండ్ మిస్”.ఈ సినిమాను ఓ.టి.టి.లో విడుదల చేయమని ఎన్నిసార్లు చెప్పినా అశోక్ వినలేదు. ఈ సినిమాను థియేటర్ లోనే విడుదల చెయ్యాలనే పట్టుదలతో.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన “ఆర్ ఎక్స్100″లా ఈ మూవీ అనిపిస్తుంది. అశోక్ మనసుని అర్థం చేసుకొని యూనిట్ అందరూ బ్రిలియంట్ వర్క్ చేశారు .యశ్వంత్ నాగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకు అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది. ఈ నెల 29న థియేటర్లో విడుదల చేస్తున్న ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు!!
దర్శకుడు అశోక్-రెడ్డి మాట్లాడుతూ… మిస్టర్ అండ్ మిస్” బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక జంట సెల్ఫీ రొమాంటిక్ వీడియోను ఇష్టపడి తీసుకుంటే ఆ వీడియో వారి చేతులు దాటి మూడవ వ్యక్తికి చేరితే ఎలా ఉంటుంది? వాళ్లు హై లో ఉన్నప్పుడు తీసుకున్న ఈ వీడియో సొసైటీకి చేరినపుడు వారి పేరెంట్స్ ఎలా స్త్రగుల్ అవుతారు, వాళ్ల రిలేటివ్స్ ఎలా ఫీలవుతారు, వీళ్లు ఎలా ఫేస్ చేశారు అనేది ఈ కథ. దీనికి ఒక మంచి లవ్ స్టోరీ జతచేసి తీయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను ఫస్ట్ రిలీజ్ చేశాము. దానికి అనుకున్న వ్యూస్ రాలేదు. ఇప్పుడొస్తున్న సినిమాలు అన్నీ బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందిందని చాలామంది అన్నారు. అందువల్ల రెండవ
ట్రైలర్ లో ఒక్క లిప్ కిస్ కూడా లేకుండా ఈ ట్రైలర్ ను విడుదల చేశాము. ఈ సినిమాకు దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు ఇన్వెస్ట్ చేసి తీసిన క్రవుడ్ ఫండెడ్ మూవీ. నా మీద, నా స్టోరీ మీద ఇంత నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఇది ఓన్లీ యూత్ తో పాటు పేరెంట్స్ కూడా చూడదగ్గ సినిమా” అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, ఆర్ట్ డైరెక్టర్ :
కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం
మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం: అశోక్ రెడ్డి!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments