మా కుమార్తెను భారత్ కు తీసుకురండి..

Date:





అమెరికాలో తన కుమార్తె దీనస్థితిలో ఉందని తిరిగి భారత్ కు తీసుకురావాలని ఓ తల్లి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ కు రాసిన లేఖ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే మహిళ ఉన్నత విద్య(మాస్టర్స్ డిగ్రీ) అమెరికాలో అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అనుకోకుండా అనారోగ్యంతో దీనస్థితిలో చికాగోలోని ఓ వీధిలో కనిపించింది. దీంతో తన కుమార్తెను భారత్ కు తీసుకురావాలని ఆమె తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది.

ఈ విషయాన్ని తెలంగాణ పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి ఉల్లా ఖాన్ ట్వీటర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. కొన్ని వస్తువులతో చికాగోలోని ఓ వీధిలో ఒక మూలలో కూర్చున్న మహిళ యొక్క వీడియోను ఖాన్ ట్విట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. అనారోగ్యంతో వున్న తను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా రక్త నమూనాలను సేకరించిన తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ మహిళ తెలిపింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సానుభూతిని వ్యక్తం చేస్తూ భారత్ కు తీసుకురావాలని కోరుతున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి...

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...