5.1 C
New York
Saturday, June 3, 2023
HomeEntertainmentMovie Updatesమాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

నటీనటుల పనితీరు: విజయ్ కంటే ముందు విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకోవాలి. భవాని పాత్రను రాసిన విధానం, ఆ క్యారెక్టర్ ను విజయ్ సేతుపతి ఓన్ చేసుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విధానం ఆడియన్స్ కు కిక్ ఇస్తుంది. జెడి కంటే భవాని క్యారెక్టర్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. విజయ్ సేతుపతి – విజయ్ ల కాంబినేషన్ లో క్లైమాక్స్ ఫైట్ తప్ప వేరే సన్నివేశాలు లేకపోవడం అనేది విజయ్ కి మంచిది అయ్యింది. ఎందుకంటే.. ఎక్కువ సీన్స్ ఉంటె విజయ్ సేతుపతి పూర్తిగా డామినేట్ చేసేసేవాడు. అతడి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా అదిరింది. “ధ్రువ”లో అరవింద స్వామి తర్వాత పర్ఫెక్ట్ గ్రాఫ్ & క్యారెక్టర్ ఆర్క్ ఉన్న పాత్ర భవాని. విజయ్ నటనలో కొత్తదనం అనేది పెద్దగా కనిపించలేదు. గెటప్ కాస్త మారింది కానీ, నటుడిగా వేరియేషన్స్ చూపించాల్సిన అవసరం చాలా ఉందని విజయ్ ఇప్పటికైనా గ్రహించాలి. ఇంకా అవే ఎలివేషన్ సీన్స్, అదే బద్ధకం యాక్టింగ్, అవే మ్యానరిజమ్స్ ను కంటిన్యూ అనేది ఫ్యాన్స్ ను సంతృప్తిపరుస్తుంది కానీ.. కామన్ ఆడియన్స్ ను కాదు అనేది విజయ్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మాళవిక మోహనన్ ను రెండు సీన్స్ కు, ఒక యాక్షన్ సీక్వెన్స్ & ఒక పాటకు మాత్రమే పరిమితం చేశారు. అర్జున్ దాస్ తన పాత్రకు న్యాయం చేసాడు. సాంకేతికవర్గం పనితీరు: సాధారణంగా సినిమాకి మూడు నాలుగు పాటలు ఇచ్చి సిచ్యుయేషన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సరిపెట్టేస్తారు సంగీత దర్శకులు. అనిరుద్ మాత్రం ఈ చిత్రంలో ప్రతి సందర్భానికి ఒక పాట ఇచ్చేసాడు. ఒక్కోసారి వచ్చేది పాటో, బ్యాగ్రౌండ్ స్కోరో అర్ధం కాదు. సినిమాకి మెయిన్ ఎస్సెట్ లో ఒకడిగా నిలిచాడు అనిరుధ్. అయితే.. అనిరుధ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందనే చెప్పాలి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ పరంగా తీసుకొన్న జాగ్రత్తలతోపాటు.. క్యారెక్టర్స్ బట్టి కెమెరా యాంగిల్స్ ను సెట్ చేసుకొని ఒక రెగ్యులారిటీ మైంటైన్ చేసిన విధానం బాగుంది. ఇక దర్శకుడు-రచయిత లోకేష్ కనగరాజన్ గురించి మాట్లాడుకుందాం. మనోడి మొదటి సినిమా “మానగరం” తెలుగులో “నగరం”కు తమిళంలో భీభత్సమైన టాక్ వస్తే.. తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే.. రెండో సినిమా “ఖైదీ” మాత్రం వీరలెవల్లో ఆడేసింది. ఆ సినిమాను అతడు తీసిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే ఆ సినిమాను ఇప్పుడు అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు.విశ్లేషణ: తమిళంలో సోలో రిలీజ్, అక్కడ విజయ్ పెద్ద స్టార్ కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావచ్చేమో కానీ.. తెలుగులో ఆల్రెడీ రవితేజ “క్రాక్” బంపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా, రేపు “రెడ్” విడుదలవుతుండగా “మాస్టర్” ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకోవడం అనేది కష్టమే. ముఖ్యంగా ఇలాంటి యావరేజ్ కంటెంట్ తో పాన్ ఇండియన్ రిలీజ్ అనేది ఆరంభ సూరత్వమే అవుతుంది తప్పితే విజయాన్ని అందుకోలేదని విజయ్ కి ఘనంగా చాటి చెప్పే సినిమా ఇది. సో, విజయ్ కి వీరాభిమానులు మాత్రమే ఓపికతో చూసి ఎంజాయ్ చేయదగిన సినిమా “మాస్టర్”. అలాగని మిగతా జనాలు చూడలేరు అని కాదు కానీ.. ఓపిక కావాలి.

రేటింగ్ 2.5/5

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments