మహేష్ బాబు కూతురు మొదటి రెమ్యునరేషన్‌తో ఏం చేసిందో తెలుసా ?

Date:

మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప‌లు వీడియోలు, రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకుంది. రీసెంట్‌గా సితార పీఎంజే జువెల్ల‌రీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారింది. ఈ సంస్థ యొక్క యాడ్‌కు సంబంధించిన ఫొటోల‌ని ఇటీవ‌ల‌ న్యూ యార్క్ టైమ్ స్వ్కేర్ బిల్ బోర్డ్‌పై ప్ర‌ద‌ర్శించారు. ఇకపోతే ఈరోజు సితార ఘట్టమనేని తన అమ్మ నమ్రత ఘట్టమనేనితో కలిసి PMJ జ్యువెల్స్ సితార సిగ్నేచర్ కలక్షన్స్ మరియు లుక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన సితార.. “తనకు సినిమాలంటే ఇష్టమని, సినిమాల్లో నటించడమంటే చాలా ఆసక్తి అని చెప్పింది. తన తల్లి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసం నేర్చుకున్నానని చెప్పింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో PMJ జ్యువెల్స్ ద్వారా SITARA సిగ్నెఛర్ కలక్షన్స్ ప్రారంభించడం పట్ల తన తండ్రి మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. మరియు అతను యాడ్ వీడియో చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యున‌రేష‌న్‌ను మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చిన‌ట్లు చెప్పింది”. దీంతో తండ్రి అడుగుజాడ‌ల్లోనే కూతురు అంటూ సితార పై అంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

న‌మ్ర‌త మాట్లాడుతూ.. స‌రైన గైడెన్స్‌, మంచి మ‌నుషుల స‌పోర్ట్ ఉంటే సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో అంద‌మైన ప్ర‌దేశం. కాక‌పోతే ఈ ప‌రిశ్ర‌మ‌పై చాలా మందికి స‌రైన అభిప్రాయం లేదు. అయితే మా పిల్ల‌ల‌ను మేము ఎప్పుడూ ప్రోత్స‌హిస్తూనే ఉన్నాం. న‌చ్చిన ప‌నినే చేయ‌మ‌ని చెబుతుంటాం. గౌత‌మ్‌కు ఇప్పుడు 16 ఏళ్లు. గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయాల‌ని ఆశ‌గా ఉన్నాడు. త‌ను సినిమాల్లోకి రావ‌డానికి ఎనిమిదేళ్లు ప‌ట్టొచ్చు. సితార న‌టించిన ఈ జ్యువెల్ల‌రీ యాడ్‌ను మ‌హేష్ చాలా ఇష్ట‌ప‌డ్డారు. రిపీట్ మోడ్‌లో ఎన్నో సార్లు చూశారు. ఇది మాకొక ఎమోష‌న‌ల్ మూవ్‌మెంట్‌ అని తెలిపారు.

ఇకపోతే ఈ జ్యూవెలరీ కంపెనీ సితారపై ‘ప్రిన్సెస్’ అనే షార్ట్ ఫిల్మ్‌ని కూడా రూపొందించింది. శౌర్య పరువు దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని PMJ జ్యువెల్స్ అధికారికంగా జూలై 19, 2023న విడుదల చేయనుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...