మహావీరుడికి మార్నింగ్ షాక్

Date:


ఐతే ఉదయం 11 గంటల సమయానికి సమస్య తీరిపోవడంతో కొంచెం లేటుగా మార్నింగ్ షోలు షెడ్యూల్ అయిన థియేటర్లలో బొమ్మ పడింది. 11.30 ప్రాంతంలో షోలు  మొదలయ్యాయి. మ్యాట్నీలకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. సినిమా సజావుగానే నడుస్తోంది. ఇంతకుముందు కమెడియన్ యోగిబాబును హీరోగా పెట్టి ‘మండేలా’ అనే వెరైటీ మూవీ తీసి మెప్పించిన మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సినిమా మంచి ఎంటర్టైనర్ అంటూ మంచి టాకే వస్తోంది ‘మహావీరుడు’కి.

అటు తమిళ నాట.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కంటెంట్ సమయానికి డెలివరీ కాకపోవడంతో యుఎస్‌లో ‘మహావీరుడు’ తమిళ వెర్షన్‌కు ప్రిమియర్సే పడలేదు. తెలుగు వెర్షన్‌కు చాలా చోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో పడాల్సిన 9 గంటల షో ఆగిపోయింది. అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలోనూ ఉదయం షోల సమయానికి కంటెంట్ డెలివరీ కాక షోలు ఆగిపోయాయి. చాలామంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చి వెనుదిరిగారు. లేదంటే వేరే సినిమాకు వెళ్లాల్సి వచ్చింది.

‘వరుణ్ డాక్టర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్. ఆ తర్వాత ‘ప్రిన్స్’ అనే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంతో మన ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇప్పుడు ‘మహావీరుడు’ అవతారం ఎత్తాడు. శుక్రవారమే ఈ సినిమా రిలీజ్. తమిళంలో భారీ అంచనాలు, తెలుగులో ఓ మోస్తరు అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి ఈ రోజు ఉదయం పెద్ద షాక్ తగిలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...