మళ్లీ ఓ పెద్ద సినిమాలో బ్రహ్మానందం

Date:


పదేళ్లు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు.. రీఎంట్రీ ఇచ్చాక బ్రహ్మితో నటించలేదు. ఆయన పునరాగమనం చేసే సమయానికి బ్రహ్మి ఫేడవుట్ అయిపోయారు. బ్రహ్మితో చిరుకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. బ్రహ్మికి సినిమాల్లో బ్రేక్ ఇప్పించిందే చిరు. వీరి కలయికలో ఎన్నో అదిరిపోయే కామెడీ ట్రాక్స్ వచ్చాయి. మరి భోళా శంకర్‌లో ఈ ఇద్దరు మిత్రులు కలిసి ఎలా సందడి చేస్తారో చూడాలి.

ఇలాంటి టైంలో బ్రహ్మికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో అవకాశం దక్కింది. ఈ చిత్రంలో బ్రహ్మి ఉన్న సంగతి తాజాగా వెల్లడైంది. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాలో నటించేసిన బ్రహ్మి.. తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన సందర్భంగా ఒక ఫొటో తీసుకున్నారు. ఇది సోషల్ మీడియాలోకి వచ్చింది. బ్రహ్మి పక్కన చిరు కూడా కనిపిస్తున్నాడీ ఫొటోలో. చిరుతో అయితే బ్రహ్మి కలిసి నటించి చాలా ఏళ్లయిపోయింది.

కొత్త తరం ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తూ ఓవైపు సినిమాలతో, మరోవైపు తన మీమ్స్‌తో ఉర్రూతలూగిస్తూ సాగిపోయిన బ్రహ్మి.. గత కొన్నేళ్లలో మాత్రం బాగా డౌన్ అయిపోయారు. ఒకప్పుడు బ్రహ్మి లేని పెద్ద సినిమా ఉండేది కాదు. కానీ గత నాలుగేళ్లలో బ్రహ్మి కామెడీ రోల్ చేసిన పెద్ద సినిమాలేవీ దాదాపుగా లేవనే చెప్పాలి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య యాక్టివ్ అయినప్పటికీ.. పెద్ద చిత్రాల్లో కామెడీ పాత్రలు మాత్రం బ్రహ్మి చేయట్లేదు.

తెలుగు సినిమాల్లో ఒక మూడు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యం చలాయించారు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం. ఆయన ముందు.. ఆయన కెరీర్ మొదలుపెట్టాక.. ఆ తర్వాతి ఏళ్లలో ఎంతోమంది కమెడియన్లు వచ్చారు. వాళ్లలో చాలామంది కొన్నేళ్లు మాత్రమే దూకుడు చూపించారు. తర్వాత సైడ్ అయిపోయారు. కానీ ఒక్క బ్రహ్మానందం మాత్రం ఏళ్లు గడిచినా.. తరాలు మారినా.. తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...

శ్రీలీల సెలవుపై రామ్ పేలిపోయే కామెంట్

రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల...

చంద్రముఖి 2 అసలు ట్విస్టు చెప్పేశారు

ప్రస్తుతానికి బజ్ పెద్దగా లేకపోయినా చేతిలో ఉన్న అయిదు రోజుల్లో...